తెలుగుదేశం హాయంలో, పెట్టుబడులు ఆకర్షించటానికి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సీఈవోగా ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ వ్యవహరించారు. కియా, హెచ్సీఎల్, లాంటి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు రావటంలో, కృష్ణ కిశోర్‌ ఎంతో సమర్ధవంతంగా పని చేసారు. అయితే, అనూహ్యంగా ఈ అధికారిని సస్పెండ్ చేస్తూ, జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలతో, నిన్న జీవో విడుదల అయ్యింది. అయితే ఇప్పుడు, ఈ వ్యవహారం అధికార వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఉన్న, జాస్తి కృష్ణ కిశోర్‌ కేంద్రం నుంచి డిప్యుటేషన్‌ పై రాష్ట్రానికి వచ్చారు. చంద్రబాబు హయంలో కీలక పదవిలో ఉన్న కృష్ణ కిషోర్, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆయన్ను పదవి నుంచి తప్పించారు. అయితే అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తనను రిలీవ్ చెయ్యాలని, కేంద్ర సర్వీస్ లకు వెళ్తానని ఆయాన కోరినా, ప్రభుత్వం స్పందించలేదు.

cs 13122019 2

అయితే అనూహ్యంగా ఆయన్ను గురువారం రాత్రి సస్పెండ్ చేస్తూ, చీఫ్ సెక్రెటరి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా, ఈ నిర్ణయం తీసుకునట్టు జీవోలో తెలిపారు. కృష్ణ కిశోర్‌పై ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌, సీఐడీ విడివిడిగా కేసులు నమోదు చేసి, ఆయన పై విచారణ జరిపి ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పటి వరకు ఆయన అమరావతి విడిచి వెళ్ళకూడదు అని ఆదేశాలు ఇచ్చారు. అయితే కేంద్ర సర్వీసు కేడర్‌లో, ఒక కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తీని, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సస్పెండ్‌ చేయడం పై అధికారులు కూడా ఆశ్చర్య పోతున్నారు. అయితే, ఇది ఇలా ఉంటే, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, కృష్ణ కిషోర్ చేసిన పని ఒకసారి గుర్తు చేసుకోవాలి.

cs 13122019 3

గతంలో జగన్ మోహన్ రెడ్డికి చెందినా, జగతి పబ్లికేషన్స్‌లో జరిగిన, అక్రమాలను జాస్తి కృష్ణ కిశోర్‌ వెలికితీసారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. కృష్ణ కిశోర్‌ 2009లో ఇన్కమ్ టాక్స్ శాఖలో హైదరాబాద్‌ రేంజ్‌-2లో అదనపు కమిషనర్‌గా పని చేసారు. ఆ సమయంలో, జగతి పబ్లికేషన్స్‌ సంస్థ 10 రూపాయల విలువ ఉన్న షేరును, రూ.370 కు అమ్మింది. ఒక్క షేరుకు రూ.360 ప్రీమియంకి అమ్మటం అసహజంగా ఉండటంతో, దీని పై చూడామని, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) హైదరాబాద్‌ రేంజ్‌-2 ఐటీ అధికారులకు ఫైలు పంపింది. ఈ బాధ్యతను అప్పటి, అదనపు కమిషనర్‌గా ఉన్న జాస్తి కృష్ణ కిశోర్‌కు అప్పగించారు. దీని పై విచారణ జరిపి, మైనస్ 18 కూడా లేని రేటుని, రూ.370కి కొనడం అసాధారణమని తెలిపారు. చివరకు ‘క్విడ్‌ ప్రోకో’గా నిర్ధారించారు. అయితే ఇప్పుడు ఆయన, చంద్రబాబు హయంలో అక్రమాలకు పాల్పడ్డారని, ఆరు నెలల్లో విచారణ జరపని, ఆయన్ను సస్పెండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read