హోం మంత్రి సుచ‌రిత పై మాజీ మంత్రి, తెలుగుదేశం నేత కే. ఎస్ జవ‌హార్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ, "హోం మంత్రి సుచ‌రిత కేవ‌లం ప్రెస్ మీట్లు పెడితే త‌ప్పా చ‌ర్య‌ల ద్వారా ఏ రోజు వెలుగులోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. ఆమె శాఖను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌డుస్తుంది. పెద్ద వాళ్ల గురించి మాట్లాడితే మ‌రింత వెలుగులోకి వ‌స్తామ‌న్న ఆలోచ‌న‌తో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. హోం మంత్రి సొంత జిల్లాలో రోడ్డుకు అడ్డంగా గోడ‌లు క‌డితే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు. ఆ రోజు ప్రెస్ మీట్ ప్ర‌జ‌ల సౌక‌ర్యం గురించి మాట్ల‌డ‌ని మీరు నేడు చంద్ర‌బాబు నాయుడుని విమ‌ర్శించ‌డం చూస్తుంటే మీ అవివేకం భ‌య‌ట‌ప‌డుతుంది. అదే విధంగా మాచ‌ర్ల సంఘ‌ట‌న మీద ఎందుకు స్పందించ‌లేదు? ఆత్మ‌కూరులో ద‌ళితులు గ్రామ బ‌హిష్కర‌ణ గురి అయితే క‌నీసం ప‌ట్టించుకోలేదు. కుచ్చులూరు బోటు ప్ర‌మాదం ఘ‌ట‌న‌ప్పుడు మీరు ఎందుకు బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌లేదు? ఎల్జీ పాలిమ‌ర్స్ లో ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత మీరు వెళ్ల‌కుండా డీజీపీ మాత్ర‌మే ఎందుకు వెళ్లారు? మీస్థాయి మీ ప‌రిస్థితి ఏంటో ఒక్క సారి హోం మంత్రి ఆలోచ‌న చేసుకోవాలి. చంద్ర‌బాబు నాయుడు ఏపీకి రావ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వానికి లేఖ రాస్తే వెంట‌నే స్పందించి అనుమ‌తినిచ్చారు."

"అదే విధంగా ఏపీలో డీజీపీ కూడా లేఖ రాస్తే రాయ‌లేద‌ని హోం మంత్రి స్థానంలో ఉండి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారు. సుచ‌రిత ఆన్ లైన్ లో అప్లికేష‌న్ చూడ‌టం నేర్చుకోవాలి. హోం మంత్రి ప్రెస్ మీట్ లో ఏదో యాంక‌ర్ లా మాట్లాడితే ఎలా? ఎల్జీ పాలిమ‌ర్స్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి క‌న్నా, శైల‌జానాధ్ రాలేదా అని చెప్ప‌డంతో మీ అవ‌గాహ‌న ఏమిటో అర్ధం అవుతుంది. వాళ్లు ఈ రాష్ట్రంలో ఉన్న వారు కాబ‌ట్టి అనుమ‌తులు అవ‌స‌రం లేదు. ప‌క్క రాష్ట్రంలో ఉన్న వారికి అనుమ‌తులు కావాల‌న్న క‌నీస ప‌రిజ్ఞానం హెం మంత్రికి లేద‌ని అర్ధం అయ్యింది. మీకు ఇంకా ఏడాది మాకే గ‌డువు ఉంది ఆ త‌రువాత మ‌రో హెం మంత్రి వ‌స్తారు. లిడ్ క్యాప్ భూములు, ద‌ళిత భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ ను అరెస్ట్ చేస్తే మీరెందుకు నోరు మెద‌ప‌లేదు. ద‌ళిత డాక్ట‌ర్ సుధాక‌ర్ పై దాడులు జ‌రుగుతుంటే పోలీసుల‌పై మీరు తీసుకున్న చ‌ర్య‌లు ఏమున్నాయి? డాక్ట‌ర్ సుధాక‌ర్ పై అలా దాడి చేయ‌మ‌ని చెప్పిన వారి ఉద్యోగాలు ఊస్టింగ్ చేయిస్తే మీపై న‌మ్మ‌కం ఉంటుంది. సీబీఐ విచార‌ణ హైకోర్టు ఇచ్చింది. హోం మంత్రి ప‌రిజ్ఞానం, జ్ఞానం పెంచుకోవాలి. దండాన్ని స‌జ్జ‌ల‌కు ఇచ్చి మీరు మాత్రం హావ‌భావాలు వ్య‌క్త ప‌రుస్తూ రిమోట్ లా ప‌ని చేయ‌డం బాధాక‌రం."

"డా. సుధాక‌ర్ విష‌యంలో ఆదిమూల‌పు సురేష్ జోక్యం లేద‌ని చెబుతున్నారు. నిజ‌నిజాలు సీబీఐ విచార‌ణ త‌ప్ప‌క భ‌య‌ప‌డ‌తాయి. గుమ్మ‌డి కాయ‌ల దొంగ ఎవ‌రంటే బుజాలు త‌డుపుకుంటున్నారు. 5 గురు ద‌ళితలు ఉండి దేనికి ప‌నికి రాకుండా ఉన్నారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న జ‌రుగుతుంది. దానిని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శ్నిస్తుంటే భ‌య‌ప‌డుతున్నారు. మీ త‌ప్పులు ఎక్క‌డ భ‌య‌ట‌ప‌డ‌తాయోన‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. విజ‌య‌సాయిరెడ్డిని ఏ ప‌దంతో పిల‌వాలో డిక్ష‌న‌రీలోను దొర‌క‌డం లేదు. ఆయ‌న మా డీజీపీ అని చెబుతున్నారు. డీజీపీ అంటే వీళ్లింట్లో పాలేరు కాదు ఆయ‌న ఆంధ్ర‌ప్‌కదేశ్ డీజీపీ అని ఆయ‌న మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నారు. వైకాపా నాయ‌కులు అహంకారంతో మాట్లాడుతున్న వాటిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఆ రోజు చంద్ర‌బాబు నాయుడు ఎక్కాల్సిన విమానం ముంబైలో ఉంది కాబట్టి అక్క‌డ నుంచి హైద‌రాబాద్ - వైజాగ్ వెళ్లాలి కాబట్టి కేంద్రానికి లేఖ రాయ‌డం జ‌రిగింది. అప్పుడున్న ప‌రిస్థితిలో కేంద్రం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. ఈ రోజు డొమోస్టిక్ స‌ర్వీసులు తిరుగుతున్నాయి. హోం మంత్రి బాధ్య‌త‌ల‌ను వేరే వాళ్ల బుజాల మీద పెట్టి ద‌ళితుల‌ను కాల్చాల‌ని చూస్తున్నారు. ద‌ళిత హోం మంత్రి అయినా ద‌ళితుల‌కు ఉప‌యోగం లేదు. క‌రోనాను అడ్డం పెట్టుకొని జ‌నాల ద‌గ్గ‌ర వెల్లం ప‌ల్లి దందాలు వ‌సూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఏడాదిలో మీరు సాధించిన ఘ‌న‌కార్యంపై చ‌ర్చ‌కు నేను సిద్దం. మీరు సిద్ధ‌మా? చంేద్ర‌బాబు నాయుడు చ‌ర్‌కకు సిద్దంగా ఉన్నారు. జ‌గ‌న్ సిద్ద‌మా? 365 రోజుకు 365 వైఫ‌ల్యాలు ఉన్నాయి. మంత్రులు బ‌రితెగించి ఉన్నారు. వారికి ఒక ఏడాది అక‌డ‌మిక్ ఇయ‌ర్ పూర్తి అయ్యింది. బూతులు తిడ‌తంలో, అబ‌ద్దాలు చెప్ప‌డంలో వ‌చ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ లో వారికి స‌ర్టిఫికేట్లు వ‌స్తాయి. శ్రీదేవి ద‌ళిత మ‌హిళా శాస‌న‌స‌భ్యులు అయ్యి ఉండి అంబేద్క‌ర్ విగ్ర‌హాం ఎవ‌రిది అని అడిగిన ప‌రిస్థితి." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read