తెలంగాణాలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎవరి పార్టీలు వారు, ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం తెలంగాణాతో ఎంత ముడిపడి ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ తో కూడా అంతే ముడి పడి ఉంటుంది. ఎందుకంటే ఆ హైదరాబాద్ నగర పునర్-నిర్మాణంలో ఆంధ్రుల పాత్ర అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా ప్రతి ఇంటి నుంచి హైదరాబద్ కు వెళ్లి పని చేసిన వారు ఉండరు అనే స్థాయికి, మనకి హైదరాబాద్ కు బంధం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా, హైదరాబాద్ తో అనుబంధం అలాగే ఉంది. అయితే ఉద్యమ సమయంలో కానీ, సొంత రాష్ట్రం ఏర్పడిన తరువాత కానీ, అక్కడ ఉన్న ఆంధ్రా వారి పై, తెలంగాణా వాదులు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ గుర్తున్నాయి. సొంత రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ స్టేట్ అని సాక్షాత్తు తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. అంతే కాదు, హైదరాబాద్ కు దీటుగా రాజధాని నిర్మాణం చేసుకుంటుంటే, అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఈ హేళనలు అన్నీ ఇంకా గుర్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అమరావతికి ఎవరు మద్దతు తెలిపినా, అమరావతి ఉద్యమానికి బలం అనే చెప్పాలి. ఇదే కోవలో, హైదరాబాద్ సెటిలర్స్ ని మంచి చేసుకోవటానీకో ఏమో కానీ, మంత్రి కేటీఆర్ అమరావతి ప్రస్తావన తెచ్చారు. నిన్న ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు ఏమి చేయటం లేదని అన్నారు.

ktr 24112020 2

పక్క రాష్ట్రంలో చక్కగా ఒక రాజధాని కట్టుకుంటున్నాం అని అమరావతిని మొదలు పెడితే, అమరావతి కోసం డబ్బులు ఇవ్వకుండా, ఒక చెంబుడు మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చి మోడీ చేతులు దులుపుకున్నారని కేటీఆర్ అన్నారు. ఎవరైనా ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటుంటే, కేంద్రం ఆదుకుంటుందని ఆశ పడతారని, అయితే వారి ఆశలు అడియాశలు చేసారని అన్నారు. అయితే మొన్నటి వరకు అమరావతిని గ్రాఫిక్స్ అన్న నోటితోనే, ఇప్పుడు కేటీఆర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో, అందరికీ అర్ధం అయినా, ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం వస్తుంది. అమరావతికి జరుగుతున్న అన్యాయం పై, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం పై, పక్క రాష్ట్రం మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్ తరుపున కూడా, కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే, అంతకంటే ఎక్కువ బాధ్యత ఉన్న జగన్ మోహన్ రెడ్డి, ఇదే స్థాయిలో కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు ? అమరావతి ఆగిపోయింది, పోలవరం 20 వేల కోట్లు మాత్రమె ఇస్తాం అంటున్నారు, 18 విభజన హామీలు అలాగే ఉన్నాయి, మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా అలాగే ఉండి పోయింది. ఆంధ్రులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. పక్క రాష్ట్రం వారు జాలి చూపిస్తుంటే, సొంత రాష్ట్రం వారు మాత్రం కేంద్రాన్ని అడగలేక పోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read