దేశ వ్యాప్తంగా మళ్ళీ జమిలీ ఎన్నికల వార్తల గురించి చర్చ మొదలైంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, గతంలో రెండో సారి ఎన్నికలు గెలవగానే, జమిలీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీని పై అప్పట్లో సమీక్షలు కూడా జరిగాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, క-రో-నా రావటంతో, మొత్తం ప్రక్రియకు బ్రేక్ పడినట్టు అయ్యింది. దీంతో ఇక ఇప్పట్లో జమిలీ ఎన్నికలు జరగవని అందరూ అనుకున్నారు. అయితే నెల రోజుల క్రితం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, త్వరలోనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయని, సంకేతాలు ఇచ్చారు. మరో ఏడాది, రెండేళ్ళ లోపే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, సిద్ధంగా ఉండాలని అన్నారు. సహజంగా చంద్రబాబు స్థాయి నేతలు, దేశానికి సంబందించిన కీలక అంశాల పై ఏవో గాలిగా మాట్లాడరు. వారి వద్ద పక్కా సమాచారం ఉంటే కానీ, ఇలాంటివి బహిరంగంగా చెప్పరు. అయితే చంద్రబాబు అప్పట్లో చేసిన వ్యాఖ్యలను, అధికార వైసీపీ ఖండించింది. చంద్రబాబు తప్పుడు సమాచారం చెప్తున్నారని, తన క్యాడర్ ని కాపాడుకోవటానికి, నాయకులు వెళ్ళిపోకుండా ఉండటానికి, చంద్రబాబు అలా అంటున్నారని, జమిలీ ఎన్నికలు లేవు ఏమి లేవు, 5 ఏళ్ళ వరకు ఎన్నికలు వచ్చే పనిలేదని వైసీపీ నాయకులు చెప్పారు.

ktr 0712220 2

అయితే ఇది ఇలా ఉండగా, ఏకంగా ప్రధాని మోడీ నోటి నుంచే, గత వారం ఈ మాట వచ్చింది. జమిలీ ఎన్నికల పై చర్చ జరగాలని, ఒక్కో చోట ఒక్కో సారి ఎన్నికల వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో పడుతున్నాయని అన్నారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో ఓటర్ జాబితా వల్ల అనవసర వ్యయం పరుగుతుందని, దీని పై దేశ వ్యాప్త చర్చ జరగాలని ప్రధాని మోడీ అన్నారు. అయితే ఈ చర్చ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెప్పారు. తమ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో, కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళ్తుందనే సంకేతాలు ఉన్నాయని, అందరం అలెర్ట్ గా ఉండాలని, జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ మాటలకు షాక్ అయ్యారు. టీఆర్ఎస్ కూడా ఇప్పటి నుంచి ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. గతంలో చంద్రబాబుని హేళన చేసిన వైసీపీ నేతలు, పక్క రాష్ట్రంలో తమ మిత్రుడు చెప్పిన మాటల పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read