ఒక పక్క నందమూరి వంశం అంటే మాకు గౌరవం, హరికృష్ణ అంటే ప్రాణం అంటూ, కేసీఆర్ చెప్పిన చిలక పలుకులు తెలిసినవే. సెటిలర్ల ఓట్లు కోసం, అప్పట్లో అలా చేసారు. కాని అదే నందమూరి వంశం నుంచి, హరికృష్ణ కూతురు పోటీలో ఉంటే, ఆమె పై దండ యాత్ర చేస్తున్నారు. ఒక పక్క టీఆర్ఎస్ చేస్తున్న రచ్చకు తోడు, మా సామాజిక వర్గం ఎక్కువ ఉంది అంటూ, అటు జనసేన, ఇటు జగన్ పార్టీ కూడా ఆమె ఓటమికి కలిసి పని చేస్తున్నారు. ఇన్ని చేస్తున్న సుహాసిని మాత్రం, ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. సెంటిమెంట్ ప్రయోగించలేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్తుంది. కాని టీఆర్ఎస్, వైసీపీ మాత్రం, ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తమ పైత్యం చూపిస్తున్నారు. అక్కడ ప్రజలని భయబ్రాంతులకి గురి చేస్తున్నారు. దీంతో, కూకట్‌‌పల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

kukatapalli 06122018

సెటిలర్స్‌‌ను కొందరు టీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పక్కా ఆధారాలతో సహా బయటపెట్టారు. వివరాల్లోకెళితే.. కూకట్‌పల్లిలోని సీబీఎన్ ఆర్మీ నాయకుడు బొల్లిన నాగేంద్ర ఇంట్లో ఉండగా టీఆర్ఎస్ నాయకులు దాడి చేసి గాయపరిచారు. సుమారు 25 మంది నాగేంద్ర ఇంట్లోకి చొరబడి, మందు బాటిల్స్ తీసుకువచ్చి రూమ్‌‌లో పెట్టి అనంతరం పోలీసులను తీసుకువచ్చి అరెస్ట్ చేయించారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. కాగా.. ఈ వ్యవహారం మొత్తం కూకట్‌‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తోడల్లుడు వాటర్ రవి (రవీంద్రారెడ్డి) ఆధ్వర్యంలో జరిగిందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.

kukatapalli 06122018

ఈ దాడికి పాల్పడిన వారిలో కాంచనపల్లి నాగరాజు దుర్గరాజు (వివేక్‌నగర్) నక్కా జశ్వంత్ ఆరోగ్యా రెడ్డి, కరుణాకర్‌రెడ్డిగా గుర్తించినట్లుగా సీబీఎన్ ఆర్మీ చెబుతోంది. మరోవైపు.. తమపై కుట్ర పన్ని దాడికి పాల్పడటమే కాకుండా టీఆర్ఎస్ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. తక్షణమే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సీబీఎన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరో పక్క నిన్న జూపూడి ప్రభాకర్ ఇంటి పై కూడా ఇలాగే దాడి చేసారు. మూడు సార్లు ఎన్నికలు కమిషన్, రెండు సార్లు పోలీసులు కలిసి దాడులు చేసి, చివరకు ఏమి దొరక్క వెళ్ళిపోతే, అక్కడ డబ్బులు దొరికాయంటూ, మీడియాలో తెరాస నాయకులు రచ్చ చేసారు. మొత్తానికి, ఓటమి తధ్యం అని తెలుసుకుని, ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read