ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక్క రోజు ముందు కలకలం చెలరేగింది. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డిని బుధవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. శేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత, కోట్ల ప్రధాన అనుచరుడు అయిన శేఖర్ రెడ్డి మృతి టీడీపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక టీడీపీ నేత శేఖర్ రెడ్డి మృతిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోట్ల సుజాతమ్మ అనుచరుడు శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. డోన్ మండలం, చాపలకొత్తూరులో శేఖర్ రెడ్డి బైక్ ను అడ్డగించిన దుండగులు ఆయనపై దాడి చేశారు.

tdp 22052019

రాడ్లు, కర్రలతో దాడి చేసిన దుండగులు అనంతరం బండరాయితో తలపై మోదారు. దీంతో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అనంతరం దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. చాపలకొత్తూరు వద్ద శేఖరరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు శేఖర్ రెడ్డి భౌతికకాయాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ హత్యతో కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

tdp 22052019

ఇక ఈ ఘటనపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవిక చర్య అమానుషమని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ దారుణానికి తెగబడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అన్నవిధాలుగా అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. కోట్ల సుజాతమ్మ అనుచరుడైన శేఖర్ రెడ్డి చనిపోవడంపై పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read