రాష్ట్ర ప్రణాళికా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు అంటే తెలియని వారు ఉండరు. గతంలో బీజేపీ పార్టీ జీవీఎల్ లాంటి వాళ్ళు చెప్పే అబద్ధాలకు ధీటుగా బదులు ఇస్తూ, జీవీఎల్ లాంటి వారి వాదన తప్పు అంటూ అనేక సార్లు నిరూపించారు. అలాగే వైసీపీ చేస్తున్న ప్రాపగాండాను కూడా ధీటుగా ఎదుర్కునే వారు. విజయసాయి రెడ్డి లాంటి వారిని కూడా ధీటుగా ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటంతో, అందరి ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తూ వస్తున్నట్టే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కుటుంబరావుని కూడా టార్గెట్ చేసారు. ఆయన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో, ఆయన వైపు నుంచి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అనే విషయం పై ఆరా తీసి రంగంలోకి దిగారు. విజయవాడ మాచవరంపరిధిలో ఆయనకు చెందిన భూమి ప్రభుత్వ భూమి అని చెప్తూ, కుటుంబరావు కబ్జా చేసారు అని చెప్పి, అక్కడకు వచ్చి అధికారులు హంగామా చేసి, స్వాధీనం చేసుకున్నారు.

kutumbrao 20092019 2

దీని పై కుటుంబరావు న్యాయ పోరాటం చెయ్యటానికి సిద్ధం అయ్యారు. తమ పేరున ఉన్న 5.10 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని కుటుంబరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటీషన్ వేసారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి ఈ పిటీషన్ పై నిన్న విచారణ జరిపారు. అలాగే అనుబంధ పిటిషన్లో ఆదేశాలు ఇవ్వటం పై నిర్ణయాన్ని వాయిదా వేశారు. కుటుంబరావు తరుపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ కింద పిటిషనర్లను సర్‌ ప్లస్‌ ల్యాండ్‌ హోల్డర్స్‌ కింద పేర్కొంటూ నిబంధనలకు విరుద్ధంగా [ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్నారని కోర్ట్ కు తెలిపారు.

kutumbrao 20092019 3

అలాగే ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని, తమ వివరణ కూడా తీసుకోకుండా నేరుగా అధికారులు వచ్చి భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. మేము కట్టుకున్న ప్రహరీగోడను రాత్రికి రాత్రి కూల్చారని కోర్ట్ కు తెలిపారు. అయితే ఈ వాదన పై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలువినిపించారు. ఈ భూమి వ్యవహారం మొదటి నుంచి మోసపూరితంగా జరిగిందని, ఆ భూమిని తమ వసం చేసుకోవటానికి పిటిషనర్లు పలు ప్రయత్నాలు చేశారని వివరించారు. ఇరువురి వాదనలను విన్న న్యాయమూర్తి, ప్రతివాదులగా ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసి దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని చెప్పారు. అందుకు కుటుంబరావు తరుపున లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, ఈలోపు ఆ భూమి పై మూడో వ్యక్తికి హక్కులు కల్పించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు. మొత్తానికి జగన్ ప్రభుత్వ వేధింపుల పై ఇలా అందరూ కోర్ట్ కు వెళ్లి పోరాడాలని, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అంటున్నారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read