రాజకీయాల్లో ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటూ వస్తాయి. గతంలో చంద్రబాబు సియంగా ఉండగా, జగన్ మోహన్ రెడ్డి రోజుకి ఒక స్కాం అంటూ చెప్పే వారు. దానికి తెలుగుదేశం పార్టీ వివరణ ఇవ్వటం, మళ్ళీ మరో ఆరోపణ, ఇలా టిడిపిని బిజీగా పెట్టేవారు. ఏకంగా చంద్రబాబు 6 లక్షలు కోట్లు దోచేశారు అని ఆరోపణలు చేసారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, అవేమీ నిరూపించలేక, చిన్న చిన్న కేసులలో ఇరికిస్తున్నారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సహజంగానే వైసిపీ పై అనేక ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే ప్రతి దానికి విరుచుకేపడే వైసీపీ, ఒక్క దానికి మాత్రం ఇప్పటికీ సరైన వివరణ ఇవ్వలేక పోతుంది. అదే తెలుగుదేశం నేత పట్టాభి బయట పెట్టిన 108 స్కాం. అయితే ఈ స్కాం పై ప్రభుత్వం వివరణ ఇస్తుంది అనుకుంటే, వెరైటీగా పట్టాభికి లీగల్ నోటీస్ లు పంపించింది. ఇంతకు ముందు కూడా, ఈ స్కాం బయట పెట్టిన తరువాత రోజు, పట్టాభికి ఇంటి ముందు పోలీసులను పెట్టటం, తరువాత మీడియా రావటంతో వాళ్ళు వెళ్ళిపోవటం తెలిసిందే.

అయితే ఇప్పుడు పట్టాభికి లీగల్ నోటీస్ లు పంపించింది ప్రభుత్వం. 104, 108 పధకాల పై అనుచిత వ్యాఖ్యలు చేసారని, క్షమాపణ చెప్పాలి అంటూ, లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. క్షమాపణ చెప్పక పొతే, క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటాం అని నోటీసుల్లో తెలిపింది ప్రభుత్వం. అయితే పట్టాభి మాత్రం, తనకు ఎటువంటి నోటీసులు అందలేదని, వార్తల్లోనే చూసాను అని, నోటీసులు అందిన తరువాత మాత్రమే, వీటి పై స్పందిస్తాను అని పట్టాభి తెలిపారు. మరి ప్రభుత్వం ఏ నోటీసు ఇచ్చిందో, దానిలో ఏమి ఉందొ, పట్టాభి ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో కూడా చంద్రబాబు సరస్వతి కంపెనీకి ఇచ్చిన రాయతీల పై, అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ, చంద్రబాబుతో పాటు, ఈనాడు, ఆంధ్రజ్యోతికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ? టిడిపి అధికార ప్రతినిధి పట్టాభికి లీగల్ నోటీస్ పై, ఇక్కడ కధనం ఆధారంగా, ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. https://youtu.be/-BkXgnjMwcs

Advertisements

Advertisements

Latest Articles

Most Read