ఆతిథ్య సేవ‌ల రంగంలోని ప్ర‌ముఖ సంస్థ లెమ‌న్ ట్రీ హోట‌ల్స్‌, విజయవాడ వాసులకి గుడ్ న్యూస్ వినిపించింది. ఈ రోజు, బాంబే స్టాక్ ఎక్స్చేంజికి ఇచ్చిన లెటర్ లో ఈ విషయం చెప్పింది. విజయవాడ నగరంలో, రెడ్ ఫాక్స్ హోటల్ బ్రాండ్ తో, హోటల్ కడుతునట్టు తెలిపింది. మొత్తం 90 గదులతో వచ్చే ఈ హోటల్, జూన్ 2020 నాటికి రెడీ అవుతుందని తెలిపింది. విజయవాడలో ఈ గ్రౌండ్ కడుతున్న రెండో హోటల్ ఇది. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలు అమరావతిలో హోటల్స్ కాట్టటానికి రెడీ అవుతున్నాయి. మరో పక్క విజయవాడలో నోవోటెల్ మొదటి ఫైవ్ స్టార్ హోటల్ కడుతుంది. వినాయాక్ ధియేటర్ దగ్గర కడుతున్న ఈ హోటల్ పనులు దాదాపుగా చివరకు వచ్చాయి.

lemontree 16082018 2

లెమ‌న్ ట్రీ కంపెనీ వివారాలు... 2002లో ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన లెమన్ ట్రీ హోటల్స్‌కి ప్రస్తుతం 28 పట్టణాల్లో 45 హోటళ్ళు ఉన్నాయి. విలాసవంతం, అందుబాటు ధరల్లో మొత్తం నాలుగు రకాల శ్రేణిలో 4697 గదులను(జనవరి 31, 2018 నాటికి) కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెడ్ ఫాక్స్, లెమన్ ట్రీ, లెమన్ ట్రీ ప్రీమియర్ పేరుతో 3 బాండ్లు ఉన్నాయి. NCR, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పాటు టైర్-1, టైర్-2 పట్టణాలైన పూణే, అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, ఇండోర్, ఔరంగాబాద్ తదితర నగరాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో మిడ్ మార్కెట్ హోటల్స్‌లో అగ్రగామి సంస్థల్లో ఒకటి లెమన్ ట్రీ హోటల్స్‌లో ప్రస్తుతం 5వేల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు.

lemontree 16082018 3

మరో పక్క అమరావతిలో 5 స్టార్‌ కేటగిరిలో హోటళ్లను నెలకొల్పే అవకాశాన్ని నోవాటెల్‌, హిల్టన్‌, క్రౌన్‌ ప్లాజా, డబుల్‌ ట్రీ అనే ప్రఖ్యాత గ్రూపులు దక్కించుకున్నాయి. ఒక్కో హోటల్‌లో 200 గదులుంటాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లు, లాంజ్‌లు, బాంక్వెట్‌ హాళ్లు, పార్కింగ్‌ వసతులు కొలువు దీరతాయి. ఇక.. 4 స్టార్‌ హోటళ్లను స్థాపించేందుకు హాలిడే ఇన్‌, గ్రీన్‌ పార్క్‌, జీఆర్‌టీ, దసపల్లా గ్రూపులు ఎంపికయ్యాయి. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించిన ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌- అంగీకారపత్రాలు)లను ఆయా హోటల్‌ గ్రూపులకు జారీ చేసిన సీఆర్డీయే.. మిగిలిన అధికారిక లాంఛనాలను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read