అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం 57వ రోజుకి చేరుకుంది. గత 57 రోజులుగా, చిన్న సంఘటన కూడా, జరగకుండా, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అమరావతి రైతులు. వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అని పిలిచినా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లు అని పిలిచినా, వారు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోకుండా, ముందుకు వెళ్తున్నారు. తమ ఉద్యమాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఇలా ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమంలో, ఈ రోజు జరిగిన ఘటనతో , మందడం ఉలిక్కి పడింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బస్సులో వెళ్తున్న ఒక వ్యక్తి, దీక్షా శిబిరం పై, మందు సీసా విసరటంతో, ఒక్కసారిగా అక్కడ ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. బస్సుల్లో వెళ్తున్న ఒక వ్యక్తి, దీక్షా శిబిరంపై మందు సీసా విసిరేశాడు. ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అని కంగారు పడిన రైతులు తేరుకుని, బస్సుని ఆపారు, గ్రామస్తులు. బస్సుని ఆపి, రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.

మద్యం సీసా విసరిన వ్యక్తీని, గుంటూరు జిల్లా ధరణికోట కు చెందిన శ్రీనివాసరెడ్డిగా గుర్తించారు. శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి వైసీపీ సానుభూతి పరుడిగా రాజధాని ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఎవరైనా చెప్తే ఇలా చేసాడో, లేక ఎందుకు చేసాడో, పోలీసులు విచారించాలని కోరుతున్నారు. ఇక మరో పక్క, రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలు, రైతులు, యువత పెద్ద ఎత్తున పాల్గొంటూ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకుని అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాజధాని పరిధిలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయ పాలెం, ఎర్రబాలెం, పెనుమాక తదితర గ్రామాల్లో మహాధర్నాలు, వంటవార్పు కార్యక్రమాలను నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. రహదారులపైకి వచ్చి వంటవార్పు నిర్వహిస్తూ జై అమరావతి అని, అమరావతిని రక్షించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు బుధ వారం నాటికి 57వ రోజుకు చేరుకున్నాయి. మహిళలు, రైతులు, యువత ప్రభుత్వ తీరుపై రోజుకో రూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు సుమారు 200 మందికి పైగా షిరిడీ సాయినాధుని సన్ని ధికి బయలుదేరి వెళ్లారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చు కుని, రాజధానిగా అమరావతినే కొనసాగించేలా జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చాలని సాయిబాబాను వేడుకోనున్నట్లు రైతులు తెలిపారు. షిరిడీ బయలుదేరి వెళ్లేముందు స్థానిక గ్రామ దేవ తలకు నైవేద్యాలు సమర్పించారు. షిరిడీలో అమరావతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. మందడం, వెలగ పూడి, తుళ్లూరు దీక్షా శిబిరాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ, తదితరులు సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలియజేశారు. సాయంత్రం సమయంలో మహిళలు ప్రదర్శనగా దుకాణాలు, ఇంటింటికీ వెళ్లి అమరావతిని తరలిస్తే జరిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ఎర్రబాలెంలో ఆర్టీసీ బస్సులను, కార్లను నిలిపి అద్దాలు శుభ్రపరుస్తూ, ప్రయాణికులకు గులాబీలు ఇస్తూ నిరసన వ్యక్తంచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read