దేశంలో ఏ రాజకీయ కుటుంబం కూడ 9 ఏళ్ల నుంచి ఆస్తుల ప్రకటన చేయలేదని, తన కుటుంబం మాత్రమే అలా చేసిందని, తుగ్లక్ సీఎం ఆస్తులను సీబీఐ, ఈడీ ప్రకటించాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడించారు. తాము చేస్తున్న ఆస్తుల ప్రకటనపై వైసీపీ బృందం కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా మాట్లాడకుండా వాస్తవాలు తెలుసుకుంటే మంచిదన్నారు. మార్కెట్ వ్యాల్యు అనేది తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందని, ఏ ధరలకైతే ఆస్తులు కొన్నామో అవే వివరాలు ప్రకటిస్తున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మైనింగ్ ద్వారా, మాఫియా ద్వారా క్విడ్ ప్రోకో ద్వారా తమ కుటుంబం ఆస్తులు సంపాదించలేదని, కష్టపడి చెమటోడ్చడం ద్వారానే ఈ స్థాయికి రావటం జరిగిందన్నారు. రాజకీయాలపై ఆధారపడకుండా స్వశక్తితో పైకి రావాలనే సదుద్దేశంతోనే చంద్రబాబునాయుడుగారు 27 ఏళ్ల క్రితం హెరిటేజ్ ను స్థాపించడం జరిగిందన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు పారదర్శకంగానే ఆ సంస్థ వ్యాపారాన్ని నిర్వహిస్తోందన్నారు. పోయిన ఏడాది 2,500 కోట్ల టర్నోవర్ వస్తే రూ.83 కోట్ల ఆదాయం హెరిటేజ్ కు వచ్చిందని ఆ సంస్థ 3 రాష్ట్రాల్లో 9 వేల మంది రైతులతో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు.

పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు 15 రాష్ట్రాల్లో అమ్ముతున్నారని, దాదాపు 3వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. వరుసగా రెండేళ్లపాటు ఆ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చిందన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలైతే ఎంతటి అద్భుతాలు సాధించగలరో చెప్పడానికి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లే నిదర్శనమన్నారు. హెరిటేజ్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అని, మూడు నెలలకు ఒకసారి చట్టం ప్రకారం అకౌంట్స్ ప్రకటించడం జరుగుతుందన్నారు. 23 ఏళ్ల క్రితం ఎన్ టీ ఆర్ ట్రస్ట్ ను స్థాపించిన చంద్రబాబు సామాన్య ప్రజానీకంతోపాటు, కార్యకర్తల కుటుంబాలను కూడా దాని ద్వారా ఆదుకుంటున్నారని లోకేశ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని తెలుగువారికి ఏ కష్టమొచ్చినా స్పందించేది ఎన్ టీ ఆర్ ట్రస్టేనన్నారు. స్వర్గీయ ఎన్ టీ ఆర్ సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన చూపిన బాటలోనే చంద్రబాబునాయుడు నడుస్తూ రాజకీయాలను పారదర్శకతగా నిర్వహించారని, అదే దారిలో తాను కూడా నడుస్తున్నానని లోకేశ్ స్పష్టం చేశారు. 2012లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ నీడలో కార్యకర్తలకు మేలు చేసేలా, వారి సంక్షేమానికి పాటు పడేలా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. సభ్యత్వం ద్వారా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా అందిస్తున్నామని, 4,300 కుటుంబాలను ప్రమాద బీమా ద్వారా ఆదుకోవటం జరిగిందన్నారు. భారత దేశంలో ఏపార్టీలోనూ ఇటువంటి విధానం లేదన్నారు. రాజకీయాలైనా, వ్యాపారమైనా, సంక్షేమమైనా విలువలకు కట్టుబడి చేయటమే తమకు తెలుసునని లోకేష్ పేర్కొన్నారు.

కోడిగుడ్డు మీద ఈకలు పీకే వైసీపీ బృందానికి సవాల్ : తొమ్మిదేళ్లుగా ఆస్తుల ప్రకటన చేస్తున్న తమపై విమర్శలు చేస్తూ, కోడిగుడ్డుపై ఈకలు పీకే కార్య్ క్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న వైసీపీ అధినేతగానీ, అతని బృందంగానీ వారికి సంబంధించిన ఆస్తులను తక్షణమే ప్రకటించాలన్న లోకేశ్, ముందుగా వారు తమ ఆస్తులను ప్రకటించి, ఎదుటివారి తప్పులను చూపిస్తే సంతోషిస్తామని తేల్చిచెప్పారు. ఈఏడాదితో కలిపి వరుసగా 9ఏళ్ల నుంచి తమ కుటుంబఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నామన్న లోకేశ్, తాము ప్రకటించినవాటికంటే ఒక్కరూపాయి ఎక్కువున్నా, ఒక్క గజం భూమి ఎక్కువున్నా దాన్ని ప్రకటించినవారికే ఇచ్చేస్తామని మరోసారి స్పష్టంచేశారు. తమపై ఆరోపణలు చేస్తున్నవారి ఆస్తులను ఇప్పటికే సీబీఐ, ఈడీలుప్రకటించాయని, అసలు వ్యక్తులు మాత్రం నోరు విప్పడంలేదన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని, బినామీ భూములని చెబుతున్నారు తప్ప, అవి ఎక్కడున్నాయో నిరూపించలేకపోతున్నారన్నారు. మండలిలో కూడా ఇదే అంశంపై తాను సవాల్ చేస్తే ఒక్కరుకూడా స్పందించలేదన్నారు. కావాలని ఆరోపణలు చేయడంతప్ప, ఎక్కడాఆధారాలు చూపే పరిస్థితులు లేవన్నారు. జగన్ తాను అవినీతిపరుడు కాబట్టి, ఇతరులను కూడా అలానే చిత్రీకరించాలని చూస్తున్నాడన్నారు. లోకేష్ ప్రెస్ మీట్ తో ఇక బాల్ జగన్ కోర్ట్ లో పడింది. అధికారం జగన్ ది కావటంతో, లోకేష్ చెప్పిన దాంట్లో తప్పు ఏమైనా ఉంటే, జగనే బయట పెట్టాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read