జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ట్విట్టర్ వేదికగా జగన్ పాలనను ఎండగడుతూ, వాళ్ళు చేసే విమర్శలు సోషల్ మీడియా వేదికగా తిప్పి కొడుతున్న లోకేష్, అదే జోరు శాసనమండలిలో కొనసాగించారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై, శాసనమండలిలో లోకేష్ మాట్లాడారు. జగన్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ లో కేటాయించిన వాటికి ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, రైతులు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారని, కాని బడ్జెట్ లో ఎక్కడా ఆ ఊసే లేదని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మూడు విడతలు రుణ మాఫీ చేసామని, నాలుగో విడత విడుదల చెయ్యగానే, ఎన్నికల నిబంధనల పేరుతొ, దగ్గరుండి వీరే ఆపించారని అన్నారు. మరో పక్క రైతులకు సున్నా వడ్డీ రుణాలు మేమే ఇస్తున్నాం అని చెప్పి, మమ్మల్ని హేళన చేసిన జగన్ మోహన్ రెడ్డి, సాయంత్రానికి కేవలం 100 కోట్లు ఇచ్చి, చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో విత్తనాల కొరతతో రైతులు అల్లాడిపోతున్నారని లోకేష్ ఆరోపించారు. గత 5 ఏళ్ళలో ఎప్పుడూ లేని విత్తన కష్టాలు మళ్ళీ వచ్చాయని అన్నారు. విత్తనాల కోసం రైతులు పొలాలు వదిలి, రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందని, వారిని లైన్లో గంటలు గంటలు నిలబెట్టి చంపుతున్నారని లోకేష్ అన్నారు. విత్తన కష్టాల పై మేము స్పందిస్తుంటే, అంతా చంద్రబాబు వల్లే ఈ కష్టాలని అంటున్నారని అన్నారు. ఏపి విత్తనాలు, తెలంగాణాకు వెళ్ళే పరిస్థితి వచ్చిందని అన్నారు. అలాగే రైతు భరోసా, 12,500, కేవలం 64.05 లక్షల మంది రైతులకే ఇస్తున్నారని, జగన మోహన్ రెడ్డి గార మాత్రం, 85లక్షల మంది రైతులు ఉన్నారని లెక్క చెప్తూ ఉంటారని గుర్తు చేసారు. మోడీ మేడ వంచుతూ అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, తిరుపతిలో మోడీ కనిపించగానే కాళ్ళ మీద పడబోయరాని, ఎద్దేవా చేసారు. మొన్నటి దాకా పోరాటాలు చేసేస్తాం అని చెప్పిన వాళ్ళు, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారని విమర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read