ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, తాము చేసిన ఘనతలు గొప్పగా చెప్పుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలా చెప్పుకోవాలి కూడా. ఏపిలో గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, ఇలా చేసింది చెప్పుకోలేక పోవటం వల్లే, ప్రత్యర్ధుల పైడ్ ప్రచారం నమ్మి, చంద్రబాబు ఓడిపోయారు అంటూ, ఆయన ఓడిపోవటానికి ఒక కారణంగా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు కాని, ప్రభుత్వాలు కాని, తమకున్న మాధ్యమాలు ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే, ప్రభుత్వ సొమ్ముతో, పేపర్లలో, టీవీల్లో, సినిమా హాల్స్ లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు ఇచ్చి, తమ గొప్పతనం చెప్పుకుంటూ ఉంటారు. దీని కోసం, వందల, వేల కోట్లు కూడా ఖర్చు పెడుతూ, ప్రజా ధనం కర్పూరంలా కరిగిస్తూ ఉంటారు. అయితే, తమ సొంతంగా చేసుకున్న పనులకు, ఇలా చేస్తే పరవాలేదు, గుడ్డిలో, మెల్ల అని ప్రజలు సరి పెట్టుకుంటారు, కాని ఇక్కడ తాము చెయ్యని పనులు, ఎవరో చేసిన పనులు కూడా, ప్రభుత్వం సొమ్ముతో ప్రచారం చేసుకుంటే ?

lokesh 01032020 2

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, వృధాప్య, వితంతు పెన్షన్లు, నెలకు రూ.200 ఇచ్చే వారు. తరువాత వచ్చిన చంద్రబాబు, ఇవి ఏ మాత్రం సరిపోవు అని, ఇప్పుడున్న పరిస్థితిలో, వాళ్ళకు ఇవి ఏ మూలకు సరిపోవని, పెన్షన్ ను వెయ్యి రూపాయలు చేసారు. తరువాత క్రమంలో, నెమ్మది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెడుతూ వచ్చి, రాష్ట్రంలో పెరిగిన సంపద, పేదవాళ్ళ వద్దకే వెళ్ళాలని, వెయ్యి రూపాయల పెన్షన్ ను, రెండు వేలు చేసారు. జనవరి 2019 నుంచి, జూన్ 2019 వరకు ఇలా రెండు వేల పెన్షన్, దాదాపుగా, రాష్ట్రంలో ఉన్న 55 లక్షల మందికి ఇచ్చారు. అయితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో, గతంలో చంద్రబాబు కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చే వారని, నేను వచ్చిన తరువాత దాన్ని రెండు వేల, రెండు వందల యాభై కి పెంచాను అంటూ యాడ్ ఇచ్చారు.

lokesh 01032020 3

అంతే కాదు, చంద్రబాబు హయంలో, కేవలం 44 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే వారని, మేము 58 లక్షల మందికి ఇస్తున్నాం అంటూ ఆ ప్రకటనలో ఉంది. అయితే ఒక ప్రభుత్వ ప్రకటనలో, తాను చెయ్యని పనులు కూడా చేస్తున్నట్టు, డబ్బా కొట్టటం పై, తెలుగుదేశం ఘాటుగా స్పందించింది. టిడిపి నేత లోకేష్, ఈ విషయం పై ట్వీట్ చేసారు. "సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా YS Jagan Mohan Reddy ? ప్రభుత్వ ప్రకటనల్లో, ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటానికి, ఇదేమన్నా మీ దొంగ సాక్షి అనుకున్నారా ? జనవరి 2019 నుంచి మీరు ప్రజల నెత్తిన పడిన జూన్ 2019 దాకా, 54.47 లక్షల మందికి పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? మీ నాయన కేవలం రూ.200 ఇస్తే, మా నాయన 2014లో వెయ్యి రూపాయలు, 2019లో రెండు వేలు చేశారు. అంటే, పది రెట్లు ఎక్కువ. ఇప్పుడు తమరు వచ్చి, 3 వేలు అని మోసం చేసి, లింగులిటుకుమంటూ, రూ.250 పెంచి, మోసం చేసింది కాక, ప్రభుత్వ సొమ్ముతో, ఇలా అబద్దపు డబ్బాలు కొట్టుకుంటారా ?" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read