ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ముందుగా చనిపోయిన వారికి సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అయితే ఈ రోజు శాసనసభ సమయానికి ప్రారంభం కాలేదు. దాదాపుగా అరగంట లేటుగా సమావేశం ప్రారంభం అయ్యింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన టైంకి కాకుండా, లేట్ గా ప్రారంభం కావటం ఎప్పుడూ లేదని, జగన్ మోహన్ రెడ్డి రాలేదని సభను వాయిదా వేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అయితే మీరు బయట నిరసన తెలుపుతున్నారు కదా, ఎప్పుడు అయితే ఏముందిలే అంటూ అధికార పక్షం కౌంటర్ ఇచ్చింది. అయితే సభ ప్రారంభమే ఇలా ప్రారంభం అయ్యింది. తరువాత బీఏసి సమావేశం జరగటం, అందులో పది రోజుల పాటు అసెంబ్లీ జరగాలి అంటూ తెలుగుదేశం పట్టుబట్టం, కుదరదు మేము అయుదు రోజులే జరుపుతాం అంటూ, అధికార పక్షం చెప్పటం జరిగిపోయాయి. ఇక తరువాత, అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అసలు ఆ బిల్లు పై మాట్లాడే అవకాసం కూడా ఇవ్వలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ వాక్ అవుట్ చేసింది. ఇది అయిపోయిన తరువాత వ్యవసాయం పై ప్రభుత్వం చర్చ మొదలు పెట్టింది. మంత్రి కన్నబాబు సుదీర్ఘంగా చెప్పారు.

lokesh 301112020 2

అయితే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రభుత్వం వాటి గురించి చెప్పటం లేదని, వాటి గురించి తమ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తామని చంద్రబాబు కోరగా, ఆయనకు మైక్ ఇవ్వకపోవటంతో, చంద్రబాబు మొదటి సారి స్పీకర్ పోడియం ముందు నేల పై కూర్చుని నిరసన తెలిపారు. తరువాత చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలను సస్పెండ్ చేసారు. తుఫాను నష్టం గురించి ప్రభుత్వానికి చెప్తాం అని చెప్పినా, అవకాసం ఇవ్వలేదు. ఇలా శాసనసభ ముగిసింది. అయితే ఈ రోజు శాసనమండలిలో కూడా వాడి వేడిగా చర్చ జరిగింది. తుఫాను పై మాట్లాడుతూ, మంత్రి బొత్సా, చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నారని, చెప్పటంతో తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. అసలు ఆ మాట చంద్రబాబు గారు ఎప్పుడు ఎక్కడ అన్నారో చెప్పండి, లేకపోతే వెనక్కు తీసుకోండి అని నారా లోకేష్ అన్నారు. మరో తెలుగుదేశం ఎమ్మేల్సీ టిడి జనార్ధన్, ఆ మాటలు అన్నట్టు నిరూపిస్తే, మేము రాజీనామా చేస్తామని, లేకపోతె మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఏదో పుస్తకంలో రాసారని బొత్సా చెప్పగా, టిడిపి అందులో రాసింది ఏమిటి, మీరు చెప్పేది ఏమిటి అని ఎదురు దాడి చేయటంతో, ఏమి చెప్పలేక అక్కడ కూడా సభ వాయిదా పడే పరిస్థితి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read