చంద్రబాబు చాలా రేర్ గా తప్ప లైన్ తప్పి, ఇష్టానుసారం మాట్లాడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ బ్యాలన్స్ తప్పి ప్రవర్తించారు. గత నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాల్లో జగన్ బ్యాచ్ అంత కవ్విస్తున్నా, ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా ప్రవర్తించారు. అలాగే చంద్రబాబు కుమారుడిగా, రాజకీయ వారసుడిగా వచ్చిన లోకేష్ కూడా, ఎక్కడా బ్యాలేన్స్ తప్పేవారు కాదు. ప్రత్యర్ధులు, ఒక పధ్ధతి ప్రకారం తన పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నా, ఎప్పుడూ కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే వారు కాదు. మంత్రిగా ఇచ్చిన ఇంటర్వ్యూ లలో, మిమ్మల్ని పప్పు అంటూ హేళన చేస్తున్నారు అని అడిగినప్పుడు, నేను పనిని నమ్ముకున్న వాడిని అని, పంచాయతీ రాజ్ మినిస్టర్ గా, ఐటి మంత్రిగా, నేను చేసిన పనులు నేను ఏంటో చెప్తాయని బదులిచ్చే వారు.

lokesh 1807209 2

ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్ వేసానని, దేశంలోనే ఎలక్ట్రానిక్స్ హబ్ గా తిరుపతిని తీర్చి దిద్దేమని, ఇవన్నీ చేసిన నన్ను పప్పు అంటే అనుకోనివ్వండి అంటూ సపోర్టివ్ గా తెసుకుని ముందుకు వెళ్ళేవారు. అయితే ఇప్పుడు అధికారం మారటంతో, జగన్ అధికారంలోకి వచ్చారు. అసెంబ్లీ సాక్షిగా, శాసనమండలి సాక్షిగా, లోకేష్ ని పప్పు పప్పు అంటూ కావాలని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ , లోకేష్ ని టార్గెట్ చెయ్యటంలో ముందు ఉన్నారు. ఇప్పటికే తన హావభావాలతో, ఇతను ఒక మంత్రా అని , అనిల్ ను చుస్తే కలిగే భావనను, అతని ప్రవర్తనతో, దొబ్బెయ్ అంటూ అసెంబ్లీలో బూతులు మాట్లాడుతూ, మరింతగా దిగాజారుతున్నారు. ఈ రోజు శాసనమండలి వేదికగా, అనిల్ కుమార్ మరోసారి లోకేష్ ని టార్గెట్ చేసారు. లోకేష్ కి మంగళగిరి అని పలకడం కూడా రాదని, తెలుగులో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

lokesh 1807209 3

దీని పై లోకేష్ ఘాటుగా బదులు ఇచ్చారు. నేను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేసానని, చాలా కాలం అమెరికాలో ఉన్నానని, మాట్లాడే సమయంలో, అందరిలగే ఒక మాట తప్పు మాట్లాడి ఉండవచ్చని, దానికి ఇలా సభలో హేళన చేస్తారా అని ప్రశ్నించారు. పంచాయితీ రాజ్ లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా , తాను మంత్రిగా ఉన్న హయంలో చేసానని, జీరోగా ఉన్న ఎలక్ట్రానిక్స్ రంగంలో, పెట్టుబడులు తెచ్చానని, దీని పై చర్చకు సిద్ధమని అన్నారు. ఒక పక్క, కేసులు ఉండి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, వారం వారం కోర్ట్ కు వెళ్ళే మీరు, ఇతరులు గురించి హేళన చేస్తారా అని అన్నారు. అలాగే మంత్రి అనిల్ కుమార్, చంద్రబాబు చిదంబరం కాళ్ళు పట్టుకున్నారని అన్నారని, దాని పై నిజాలు చెప్పి నిరూపించండి అని లోకేష్ చాలెంజ్ చేసారు. ఒక మంత్రి వాక్ అవుట్ చేసి, వెళ్ళటం చరిత్రలోనే లేదని లోకేష్ అన్నారు. మొత్తానికి సహజ శైలికి భిన్నంగా, అనిల్ కుమార్ కు అర్ధమయ్యే భాషలో, పప్పు గుత్తి దింపేసారని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read