అంతా అనుకున్నట్టే జరుగుతుంది. అంతా భయపడినట్టే, ఒక విష సంస్కృతీ రాజ్యమేలటానికి సిద్ధం అవుతుంది. గ్రామా వాలంటీర్ల వ్యవస్థ అంటూ, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అంటూ చెప్పిన జగన్ ప్రభుత్వం, గ్రామా వాలంటీర్ల అందరినీ, వైసీపీ కార్యకర్తలతో నింపేసింది. వారికి ఎదురు డబ్బులు ఇచ్చి, అఫీషియల్ గా, పార్టీ ప్రమోషన్ కోసం, ఎన్నికల సమయంలో పోల్ మ్యానేజ్మెంట్ కోసం వాడుకునే ఎత్తుగడ దీని వెనుక కనిపిస్తుంది. అయితే పైకి మాత్రం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అంతా ఎంతో నిజాయతీగా నేలకోపుతున్నాం అని చెప్తున్నారు. దీనికి ఒక పరీక్ష కూడా పెట్టారు. కేవలం పరీక్షలో బాగా రాసిన వారు మాత్రమే, గ్రామ వాలంటీర్గా అవకాసం ఇస్తాం అని ప్రభుత్వం అంటుంది. అయితే, తాజాగా నారా లోకేష్ విడుదల చేసిన ఒక సీక్రెట్ వీడియోలో, విజయసాయి రెడ్డి మాటలు వింటే, ఎంత ప్లాన్ చేసారో అర్ధం అవుతుంది.

vsreddy 12082019 2

నిన్న వైసీపీ సోషల్ మీడియా సమావేశం జరిగింది. పోయిన ఎన్నికల్లో బాగా పని చేసిన వారిని అభినందిస్తూ, ఇప్పుడు ఏమి చెయ్యాలో దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశానికి విజయసాయి రెడ్డి వచ్చారు. అయితే కొంత మంది సోషల్ మీడియా కార్యకర్తలు, మాకు గుర్తింపు లేదు అంటూ నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంలో మాట్లాడిన విజయసాయి రెడ్డి, గుర్తింపు లేదు అని ఎందుకు అనుకుంటున్నారు, మిమ్మల్ని అన్ని విధాలుగా చూస్తున్నాం. ఉదాహరణకు, 4 లక్షల గ్రామ వాలంటీర్లు అందరూ మన వాళ్ళనే నియమించాం. అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేం కానీ మనం అనుకున్నది విజయవంతంగా పూర్తి చేసాం. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలన్నీ మన వాళ్ళకే ఇచ్చుకోవడంలో విజయం సాధించాం అని వైకాపా సోషల్ మీడియా మీట్లో చెబుతూ అడ్డంగా దొరికిపోయారు విజయసాయి రెడ్డి.

vsreddy 12082019 3

ఈ సీక్రెట్ వీడియోని లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఇది అతి పెద్ద స్కాంగా, అతి పెద్ద క్విడ్ ప్రోకోగా అభివర్ణించారు. ఇది లోకేష్ ట్వీట్... "YS Jagan Mohan Reddy గారు స్కామ్ స్టార్ అని మరోసారి ఆధారాలతో రుజువైంది. గ్రామ వాలంటీర్ల స్కామ్ తో 12వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకం అని జగన్ గారు ఆస్కార్ రేంజిలో నటిస్తుంటే, కడుపులో దాచుకోలేక వైకాపా స్కామ్ ని దొంగలెక్కల వీరుడు బయటకి కక్కేశారు. వాలంటీర్ల నియామకంలో కులం, మతం చూడలేదు వైకాపా కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూసాం అని స్వయంగా ప్రకటిస్తున్నారు. నాలుగు లక్షల మంది వైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి వారి పొట్ట కొట్టే భారీ కుట్రే వైకాపా వాలంటీర్ల స్కీం." https://www.facebook.com/naralokesh/videos/400753420566355/

Advertisements

Advertisements

Latest Articles

Most Read