తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, ఈ రోజు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం కృష్ణా జిల్లా పర్యటన ముగించుకుని, పశ్చిమ గోదావరిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా,  ఆకివీడులో పర్యటిస్తున్న ఆయన, వరద నీటిలో మునిగిన వారి వద్దకు, వెళ్ళే దారి లేకపోవటంతో ట్రాక్టర్ పైనే బయలు దేరారు. లోకేష్ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో, లోకేష్ నడపుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి, కొద్ది మేర ఉప్పుటేరు కాలువలోకి ఒరిగింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప ప్రమాదం కావటంతో, వెంటనే అప్రమత్తం అయిన కార్యకర్తలు, సెక్యూరిటీ సిబ్బంది, లోకేష్ ని పక్కకు తీసుకోవచ్చారు. అదే ట్రాక్టర్ పై ఉండి ఎమ్మెల్యే రామరాజు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఆకివీడు మండలం పెద్దాపురం వద్ద జరిగింది. ఇక్కడ ఇప్పటికీ గ్రమాలు అన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. రహదారుల పై ఇప్పటికీ వరద నీరు ప్రవహిస్తుంది. ఈ వరద నీటిలోనే, ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేసారు. అయితే, ఇదే క్రమంలో నీరు ఎక్కువగా ఉండటంతో, ట్రాక్టర్ అదుపు తప్పింది. అయితే స్లో గా వెళ్తూ ఉండటంతో, ఉప్పుటేరు పక్కన కాలువలోకి ఒరిగింది. ప్రస్తుతం లోకేష్ పర్యటన ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read