రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసే కందిపప్పు, పంచదార ధరలను పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటివరకు తెల్ల కార్డు లబ్దిదారులకు సబ్సిడీపై ఇస్తున్న చక్కెర, కందిపప్పుల ధరలు పెరగను న్నాయి. గతంలో కిలో కందిపప్పు రేషన్ దుకాణాలలో రూ. 40 ఉండగా.. దానిని రూ. 27 పెంపుదల చేసి రూ. 67కి అందించనున్నారు. అలాగే లబ్దిదారులకు అరకిలో చొప్పున అందిస్తున్న పంచదార ధర ఇప్పటి వరకు రూ. పది ఉండగా.. దానిని రూ. 17కు పెంచారు. వచ్చే నెల నుంచి ఈ ధరలు అమలులోకి రాను న్నాయి. అయితే దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్న అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు (కేంద్ర ప్రభుత్వ పధకం) మాత్రం పాత ధరలకే ఆయా సరుకులు అందనున్నా యి. ఇదిలా ఉండగా.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇలా పేదలకు ఉపయోగపడే వాటి పై, పొట్ట నింపుకునే వాటి పై, ధరలు పెంచటం పై అన్ని వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి.

దీని పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ స్పందించారు. ఒకేసారి, కేజీకి రూ.27 పెంచటం పై, ఆయన తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. అయితే ఈ సందర్భంలో, రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న, ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించిన తీరులో లోకేష్ స్పందించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు, తమ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పటికే ఈ విషయం పై, ఎలక్షన్ కమిషన్ రెండు మూడు సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉపయోగించవద్దు అని చెప్పిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పిన విషయం తెలిసిందే. అయితే పెరిగిన రేషన్ సరుకులు రేట్లు పై, లోకేష్ స్పందిస్తూ, జగన్ పార్టీని కొత్తగా పిలిచారు. ‘‘యుశ్రారైకాపా'' అంటూ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే అర్ధం వచ్చేలా లోకేష్ స్పందిస్తూ, ''యుశ్రారైకాపా'' ప్రభుత్వం ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో లాగేసుకుంటుంది అని, రేషన్ సరుకుల రేట్లు పెంపుదల వల్ల, పేదల పై అదనంగా రూ.600 కోట్లు పడుతుందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read