తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించి ఆసక్తికర వీడియో ఒకటి పోస్ట్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు తిరుమల పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా, పట్టు వస్త్రాలు సమర్పించటానికి తిరుమల వెళ్ళారు. తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత, రెండు రోజుల పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గున్నారు. అయితే ప్రతి సారి జగన్ పర్యటన పై అనేక హిందూ సంఘాలు, ఆయన క్రీస్టియన్ అని, తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి అనే నిబంధనను జగన్ అతిక్రమిస్తున్నారు అంటూ, విమర్శలు చేసే వారు. ఈ సారి ఆ విమర్శలు పెద్దగా వినిపించ లేదు. అయితే ఈ సారి జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి, నారా లోకేష్ ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. అందులో రెండు ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. ఇవి రాజకీయంగా చేసిన విమర్శలు అయినా కూడా, జగన్ మోహన్ రెడ్డి తీరు పై, పలు విమర్శలు వస్తున్నాయి. లోకేష్ ఈ వీడియో పోస్ట్ చేయటంతో, రాజకీయ టర్న్ తీసుకున్నా, ఈ వీడియోలు ఉన్న అంశాలు మాత్రం, శ్రీవారి భక్తులను, అలాగే హిందువులు మనోభావాలు దెబ్బ తీసేవి లా ఉన్నాయి అంటూ, సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

ln 1300102021 2

లోకేష్ పోస్ట్ చేసిన ఆ వీడియోలో, జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించిన తరువాత, పూజారులు అక్షింతలు వేసారు. అక్షింతలు వేసిన వెంటనే, జగన్ మోహన్ రెడ్డి తల పాగా తీసి వేసిన తరువాత, తన తలలో అక్షింతలు అన్నీ జగన్ మోహన్ రెడ్డి దులిపెసుకోవటం పలువారికి ఆశ్చర్యానికి గురి చేసింది. అక్షింతలు వేసి ఒక్క నిమిషం కూడా కాకుండా, జగన్ అక్షింతలు దులిపేసుకున్నారు. ఇక రెండో వీడియోలో జగన్ తులాభారం ఇస్తున్న సందర్భంలో, వైవి సుబ్బారెడ్డి భార్య, వెంకన్న నామస్మరణ చేయాల్సిన చోట, జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అనటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ మోహన్ రెడ్డి భజన చేయటం ఏమిటి అంటూ విమర్శలు వచ్చాయి. ఇదే వీడియో రూపంలో లోకేష్ ట్వీట్ చేస్తూ విమర్శలు చేసారు. జగన్ రెడ్డి భార్య ఎందుకు పట్టు వస్త్రాలు సమర్పించేప్పుడు రాలేదు అంటూ విమర్శలు చేసారు. మరి దీని పై వైసిపి శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. దీని పై ఎటువంటి వివాదాలు వస్తాయో, వైసీపీ ఎలా సమర్ధించుంకుంటుందో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read