వైఎస్ అవినాష్ రెడ్డి గారి త‌ల్లి క్షేమంగా గుండెపోటు గండం నుంచి గ‌ట్టెక్కాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని టిడిపి యువ‌నేత నారా లోకేష్ ప్రార్థించారు. దీని అర్థం ఏంటి అనేది ఇప్పుడు ఏపీలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆమె ప్రాణాల‌కి ముప్పు ఉంద‌నే భయాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. వైఎస్ వివేకానంద‌రెడ్డిని చంపేసి గుండెపోటు ప్ర‌చారంలోకి తెచ్చిన గ్యాంగు...ఆ హ‌త్య‌తో సంబంధం ఉన్న ఒక్కొక్క‌రినీ అనుమానాస్ప‌ద మ‌ర‌ణాల పేరుతో త‌ప్పించేస్తున్నారు. ఇప్పుడు అస‌లు నిందితులు చ‌ట్టానికి చిక్క‌కుండా ఈ గుండెపోటు డ్రామా త‌ల‌పెట్టార‌ని విశ్లేషిస్తున్నారు రాజ‌కీయ మేధావులు. సీబీఐ విచార‌ణ‌కి ర‌మ్మ‌ని నోటీసులు ఇచ్చిన క్ర‌మంలో గుండెపోటుకు గురైన వైయస్ అవినాష్ రెడ్డి గారి తల్లి వైయస్ లక్ష్మమ్మని మెరుగైన చికిత్స కోసం బెంగ‌ళూరు త‌ర‌లించే అవ‌కాశం ఉంది. హైద‌రాబాద్ తీసుకొచ్చే వ‌న‌రులు అవినాష్ రెడ్డికి ఉన్నాయి. అటూ ఇటూ కాకుండా క‌ర్నూలు ఆస్ప‌త్రిలో ఎందుకు చేర్చార‌నేది ఇప్పుడు మిస్ట‌రీ.  వైఎస్ జ‌గ‌న్ రెడ్డి మీడియా క‌థ‌నాల ప్ర‌కారం అవినాష్ రెడ్డి త‌ల్లి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో వైద్యులు ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. రక్తపోటు తక్కువగా ఉండడంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ఈ ఆస్ప‌త్రి ఎవ‌రిది అంటే డాక్ట‌ర్ కాంతారెడ్డిది. త‌న అల్లుడైన కార్డియాక్ స‌ర్జ‌న్ హితేష్ రెడ్డి సొంతూరు పులివెందుల మండ‌లం సింహాద్రిపురం. వైఎస్ ఫ్యామిలీ మ‌నుషులే ఈ వైద్యులు. వైజాగ్లో కోడిక‌త్తి గీరుకుంటే, ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్‌లోని సాంబ‌శివారెడ్డి  న్యూరో సెంట‌ర్‌కి ప్ర‌త్యేక విమానంలో త‌ర‌లిపోయారు జ‌గ‌న్ రెడ్డి. ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చాక సాంబ‌శివారెడ్డికి కేబినెట్ ర్యాంకు ప‌ద‌వి ఇచ్చారు. ఇప్పుడు విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న అవినాష్ త‌ల్లి ల‌క్ష్మ‌మ్మ‌కి వైఎస్ వివేకానంద‌రెడ్డిలాంటి గుండెపోటు మ‌ర‌ణం తెప్పించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీబీఐ అరెస్ట్ చేస్తే, అది త‌ట్టుకోలేకే త‌న త‌ల్లి చ‌నిపోయింద‌ని ఒక వెర్ష‌న్ వినిపిస్తార‌ని, అరెస్ట‌య్యాక ..ఆమె గుండెపోటుతో చ‌నిపోతే అంత్య‌క్రియ‌ల కోసం తీసుకొస్తార‌ని...ఇలా ఆమె ప్రాణాల‌కి ఎలాగైనా ముప్పు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌నే ఆందోళ‌న‌లు ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌రిశీలించిన నారా లోకేష్ అవినాష్ రెడ్డి త‌ల్లిగారు గుండెపోటు గండం నుంచి గ‌ట్టెక్కాల‌ని, వివేకానంద‌రెడ్డిలా ఆమె బ‌లికాకూడ‌ద‌ని దేవుడిని ప్రార్థించార‌ని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read