ఇసుక స‌మ‌స్య ప్ర‌భుత్వానికి చాలా చెడ్డ‌పేరు తెచ్చి పెడుతుంది. జ‌గ‌న్ అంటే బాగా మోజుగా ఉన్న జ‌నాలు కూడా ఇసుక విష‌యంలో ఇబ్బంది ప‌డుతున్నారు. ఇసుక కొర‌త‌పై ప‌వ‌న్ లాంగ్ మార్చ్ అనుకున్న‌దానికంటే విజ‌యవంతం అయ్యింది. ఇంటిలిజెన్స్ నివేదిక‌తోపాటు వైకాపా ఫీల్డ్ ఫీడ్ బ్యాక్ కూడా ఇసుక కొర‌త‌తో ఇబ్బందులు నిజ‌మేన‌ని ప్ర‌భుత్వానికి నివేదించాయి. ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు గారు చేప‌డుతున్న దీక్ష ప్ర‌భుత్వాన్ని షేక్ చేస్తోంది. తెలుగుదేశం ప్ర‌భుత్వం ఇసుక కొర‌త‌పై చేస్తున్న ఉద్య‌మాలు,దూకుడుతో వైకాపాని చాలా చికాకు పెడుతున్నాయి. దీనిని డైవ‌ర్ట్ చేయ‌డానికి వారు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. రేపు చంద్రబాబు దీక్ష అనగా, ఈ రోజు మరో కొత్త ప్రచారానికి తెర లేపారు. ఇసుక వెబ్సైటు హ్యాక్ అయ్యింది అని, వెబ్సైటు మొత్తం హ్యాక్ కాదు, వెబ్సైటు లో ఉన్న ఓక ఫీచర్ హ్యాక్ చేసి, నో స్టాక్ అంటూ చూపిస్తున్నారని, ఇది నారా లోకేష్ సన్నిహిత కంపెనీ ఒకటి చేస్తుంది అంటూ, ఈ రోజు సాయంత్రం నుంచి సాక్షిలో వార్తలు ఇస్తున్నారు. అయితే, ఈ వార్తలు రాగానే లోకేష్ ఘాటుగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డికి, లేఖ రాసారు.

కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 42 మంది భవన నిర్మాణ కార్మికులను పొట్టనపెట్టుకున్న వైకాపా ప్రభుత్వం, జగన్ గారు చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరో కుట్రకి తెరలేపారు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇంత కాలం వరద కారణంగా ఇసుక కొరత ఏర్పడింది, పోలీసులే అక్రమ ఇసుక రవాణాని ప్రోత్సహిస్తున్నారు అని తలో మాటా చెప్పిన వైకాపా నేతలు ఇప్పుడు తన పై అసత్య ప్రచారాలకు తెర లేపారని లోకేష్ అన్నారు. వైకాపా ఇసుకాసురులు అడ్డంగా దొరికోపోయారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైకాపా నేతల జాతకాలు టిడిపి బయటపెట్టడం తో వైకాపా ప్రభుత్భం మరో కొత్త నాటకం మొదలు పెట్టిందని అన్నారు.

"5 నెలలుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్ల పాలు చేసి 42 మందిని వైకాపా ఇసుకాసురులు బలి తీసుకున్నారు. ఇప్పుడు చేసిన తప్పులు బయటపడి ప్రజలు మోహన ఉమ్ము వేసే పరిస్థితి రావడంతో మరో సారి కట్టు కథ రెడీ చేసింది.గతంలోనే జగన్ గారు నాపై అనేక ఆరోపణలు చేసారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలల అయినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేక ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసారు. విశాఖ లో బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ పై సిఐడి దాడులు లోకేష్ కి అత్యంత సన్నిహితుడు కంపెనీ అంటూ మరో అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు.నేను గతంలో అనేక సార్లు జగన్ గారికి నేరుగా సవాల్ చేసా.ఇప్పుడు మరోసారి సవాల్ విసురుతున్నా జగన్ గారి చెత్త మీడియా కి కూడా నేరుగా సవాల్ చేస్తున్నా దోంగ చాటుగా అసత్య వార్తలు ప్రచారం చేసి ఆనంద పడటం కాదు దమ్ముంటే నా పై మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి.బ్లూ ఫ్రాగ్ కంపెనీ కి నాకు ఎటువంటి సంబంధం లేదు.నాకు ఆ కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు అసత్య వార్తలు సృష్టించిన వారిపైనా సోషల్ మీడియా ఒక కుట్ర ప్రకారం నా పై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానాని తెలియజేస్తున్నాను. ....టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్"

Advertisements

Advertisements

Latest Articles

Most Read