గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఉన్న ప్రధాన కారణాల్లో సోషల్ మీడియా ఒకటి అని కూడా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. చేసింది చెప్పుకోలేక పోవటం, మరో పక్క ప్రత్యర్ధి పార్టీలు అయిన వైసిపీ, బీజేపీ, జనసేన స్పెషల్ టీంలు పెట్టుకుని మరీ, సోషల్ మీడియాలో చేసిన వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్ట లేక పోవటం, తెలుగుదేశం బలహీనతగా చెప్పుకోవాలి. ఫేక్ న్యూస్ లు కూడా ప్రత్యర్ధి పార్టీలు స్ప్రెడ్ చేస్తే, అది తప్పు అని ఖండించే వారు తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో ఉండే వారు కాదు. స్వచ్చందంగా పని చేసే కార్యకర్తలు ఉన్నా, వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటికి రీచ్ ఉండేది కాదు. ఫలితాలు తరువాత, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పై ద్రుష్టి పెట్టినట్టే కనిపిస్తుంది. ఇది వరకు లాగా కాకుండా, ప్రత్యర్ధి పార్టీలు ఏదైనా తప్పుడు విమర్శ చేసిన వెంటనే లోకేష్ ఖండిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

కొద్దిగా మార్పు వచ్చింది అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఈ రోజు నారా లోకేష్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. స్వచ్చందంగా ట్విట్టర్ వేదికగా పార్టీ కోసం ప్రతి రోజు ప్రత్యర్ధి పార్టీలతో పోరాడే కార్యకర్తలను, ఈ రోజు లోకేష్ ట్విట్టర్ లో ఫాలో అయ్యారు. దాదపుగా ఒక 30 మంది వరకు, సామాన్య కార్యకర్తలు, ఎవరు అయితే పార్టీ కోసం పోస్ట్ లు పెడుతున్నారో, వారిని ఫాలో అయ్యారు. ఈ చర్యతో, కార్యకర్తలు సంతోష పడుతున్నారు. సామాన్య కార్యకర్తలు ఏమనుకుంటున్నారో, లోకేష్ ట్విట్టర్ లోకి వెళ్ళగానే తెలిసిపోతుందని, వైసిపీ పై విమర్శలే కాదు, సొంత పార్టీలో ఉండే ఇబ్బందులు కూడా డైరెక్ట్ గా లోకేష్ కే చెప్పుకోవచ్చని, ఆ సామాన్య సానుభూతి పరులు అంటున్నారు. ఈ రోజు ఒక కార్యకర్త పుట్టిన రోజుకి కూడా, లోకేష్ విషెస్ చెప్పారు. ఈ చర్యలు అన్నిటితో, కార్యకర్తలు ఖుషీగా ఉన్నారు. సోషల్ మీడియాలో వీరిని ఫాలో అవ్వటం ఒక ఎత్తు అయితే, వీళ్ళు నిజంగా పార్టీ కోసం కష్టపడే వారని, అలాంటి వారిని వెతికి పట్టుకుని, ఫాలో అవుతున్నారు అంటే, ఖచ్చితంగా మార్పు వచ్చిందని, మరింతగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఆక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read