ఈ రోజు అన్న ఎన్టీఆర్ వర్ధంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం శ్రేణులే కాక, సామాన్య ప్రజలు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో ఉదయం బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ రోజు చంద్రబాబుకు కరోనా రావటంతో, ఆయన కార్యక్రమాలు అన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ లో, లక్ష్మీ పార్వతి కూడా వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు విని, అక్కడ ఉన్న వారు,మీడియా షాక్ తిన్నారు. ఆమె మాట్లడుతూ, మీకు 26 ఏళ్ళ తరువాత ఒక రహస్యం చెప్తున్నా అని చెప్పి మొదలు పెట్టారు. ఆ రహస్యం ఏమిటా, ఆమె ఏమి చెప్తుందా అనుకుంటే, ఆమె మాట్లాడుతూ, 26 ఏళ్ళ క్రితం, తాను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడినట్టు ఆమె చెప్పారు. ఎన్టీఆర్ చనిపోయిన తరువాత, జీవితా రాజశేఖర్, మద్రాస్ తీసుకుని వెళ్ళారని, అక్కడ ఒక అమ్మాయిని కలిసాను అని, ఆ అమ్మాయిలోకి ఎన్టీఆర్ ఆత్మ వచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ ఆ అమ్మాయిలోకి రాగానే, ఆ అమ్మాయి ఎన్టీఆర్ హావభావాలతో కనిపించిందని చెప్పారు. ఆ రోజు ఎన్టీఆర్ ఆత్మ ఆ అమ్మాయిలోకి రాగానే, ఎన్టీఆర్ ఆత్మతో చాలా విషయాలు మాట్లాడానని అన్నారు.

lp 18012022 2

ఎన్టీఆర్ ఆత్మ తనకు అనేక విషయాలు చెప్పిందని ఆమె అన్నారు. అయితే చాలా విషయాలు ఎన్టీఆర్ ఆత్మని అడుగుదామని అనుకున్నా, తనకు ఏడుపు వచ్చిందని, అందుకే ఎక్కువ మాట్లాడలేక పోయానని చెప్పారు. ఈ ఆత్మ గురించి రహస్యం అంటూ ఆమె చెప్పాటంతో, పలువురు షాక్ అయ్యారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి కూడా, ప్రతి రోజు 12 గంటలకు వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడతాను అంటూ, వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లక్ష్మీ పార్వతి కూడా ఆత్మల గురించి చెప్పటంతో, ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ఏది నిజమో, ఏది భ్రమో అర్ధం కాక అలా ఉండి పోయారు. ఇక లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం ఎవరు చేసినా తప్పే అని అన్నారు. దుర్గి ఘటనలో తాను అక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో మాట్లాడనని అన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలి అంటూ, చెప్పుకొచ్చారు. మొత్తానికి, ఈ సారి ఎన్టీఆర్ వర్ధంతికి లక్ష్మీ పార్వతి స్పీచ్ హైలైట్ అనే చెప్పాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read