ఇప్పుడున్న పరిస్థితిలో, ఒక కంపెనీ తీసుకు రావాలి అంటే, ఏ రాష్ట్రానికైనా, చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకుంటే, అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు పోటీ పడి, ఆ కంపెనీలను ఆకట్టుకునే స్థాయికి వచ్చాయి. కంపెనీల పెట్టుబడులు కోసం, రాయతీలు, కొత్త పాలసీలు, సమ్మిట్ లు, ఇలా అనేక ప్రయత్నాలు చేస్తే కాని, ఒక కంపెనీ రాష్ట్రాలకు వచ్చి పెట్టుబడులు పెట్టవు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి పెద్ద పెద్ద నగరాలకు ఇన్ఫ్రా ఎక్కువ ఉంటుంది, కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ కంపెనీలు అటు వైపు మొగ్గు చూపుతాయి. మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు పెట్టుబడులు రావాలి అంటే, మనం ఎంతో శ్రమించాలి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం అని, దీన్ని ఎలా అయినా బాగు చెయ్యాలి అనే ఉద్దేశంతో, పెట్టుబడులు కోసం, అనేక తిప్పలు పడ్డారు. కియా లాంటి కంపెనీని, అన్ని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చారు. శివ నాడర్ లాంటి వారిని, తన కార్ లో ఎయిర్ పోర్ట్ లో దింపి మర్యాదలు చేస్తే, హెచ్సీఎల్ లాంటి పెద్ద ఐటి కంపెనీ గన్నవరం వచ్చింది.

lulu 24012020 2

అలాగే హీరో హోండా కంపెనీ ఎలా వచ్చిందో, ఆ కంపెనీ సిఈఓ చెప్పారు. ఢిల్లీలో తనకు బ్రేక్ ఫాస్ట్ స్వయంగా చంద్రబాబు ఒడ్డించారని, ఆ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లోనే, హీరో కంపెనీ, ఏపిలో పెట్టటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ లాంటి పెద్ద సంస్థలు కూడా, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకొచ్చాయి. అయితే, అనూహ్యంగా, ప్రభుత్వం మారటంతో, ఈ కంపెనీలు వెనక్కు వెళ్ళిపోయాయి. అయితే ఇవి వెనక్కు వెళ్ళటం వెనుక, ఏపి ప్రభుత్వం వైఖరి ఉందంటే నమ్మగలరా ? స్వయంగా లూలు కంపెనీ, ఈ విషయం చెప్పింది. తమకు ఏపి ప్రభుత్వం భూములు రద్దు చేసిందని, ప్రపంచ స్థాయిలో తమ పేరు ప్రఖ్యాతలకు పోయే విధంగా, ఏపి ప్రభుత్వం వ్యవహరించిందని, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది లూలు గ్రూప్.

lulu 24012020 3

దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ, ఇప్పుడున్న పరిస్థితిలో, భవిష్యత్తులో మేము ఆంధ్రప్రదేశ్ లో రూపాయి పెట్టుబడి కూడా పెట్టం అని, కాని, వివిధ రాష్ట్రాల్లో మా పెట్టుబడులు పెట్టి, ఆ రాష్ట్రాల అభివ్రుద్దిలో తోడ్పడతాము అని చెప్పింది. దీంతో, మన రాష్ట్రంలో లూలు గ్రూప్ రూ.2,200 కోట్ల పెట్టుబడి వెనక్కు వెళ్ళిపోయింది. మొన్న బొత్సా కూడా, లూలు వెనక్కు వెళ్ళలేదు, మేము పంపించి వేసాం అని గర్వంగా చెప్పుకున్నారు కూడా. అయితే, ఇప్పుడు లూలు, చెప్పిన ప్రకారమే, మిగతా రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టి, ప్రాజెక్ట్ లు కడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో, ఒక పెద్ద కన్వేషన్ సెంటర్ కట్టటానికి ఒప్పందం కుదుర్చుకున్న లూలు, ఇప్పుడు బెంగుళూరులో కూడా 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 80 ఏళ్ళ వయసులో కూడా యడ్యూరప్ప, దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లి, అక్కడ లూలు గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మన రాష్ట్రం నుంచి దావోస్ కు ప్రాతినిధ్యం లేదు. మన నుంచి వెళ్ళిపోయిన ప్రాజెక్ట్, ఇప్పుడు మన పక్క రాష్ట్రాలు అయిన తెలంగాణా, కర్ణాటకలో భారీ పెట్టుబడులు పెట్టింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read