ఒకరికి నష్టం, మరొకరి లాభం అంటారు పెద్దలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విషయంలో అదే జరుగుతుంది. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఈ ఆరు నెలల్లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. కాని, ఈ ఆరు నెలల్లో, గతంలో చంద్రబాబు హయంలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన వాళ్ళు మాత్రం, వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయిన వారు, మనల్ని వెక్కిరుస్తూ, ఈ పక్కనే, పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతూ, ఉద్యోగాలు, ఆదాయం పెంచుకుంటున్నారు. ఇప్పటికే కియా అనుబంధ సంస్థలు చెన్నై వెళ్ళిపోయాయి. ఇక అదానీ డేటా సెంటర్, ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి, దీంతో వాళ్ళు తెలంగాణా వెళ్ళిపోయారు. ఇక సింగపూర్ కు చెందిన కంపెనీలు కూడా తెలంగాణా వెళ్ళిపోయాయి. రిలయన్స్ జియో కూడా, వేల్లిపోటానికి సిద్ధంగా ఉంది. ఇక ప్రకాశంలో పెట్టే పేపర్ మిల్ కూడా అడ్రెస్ లేదు. ఇప్పుడు ఈ జాబితాలో ‘లూలూ’ గ్రూప్ కూడా చేరింది. వీళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణా వెళ్ళిపోయి, అక్కడ పెట్టుబడి పెడుతున్నారు.

lulu 12122019 2

దుబాయ్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ ‘లూలూ’ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ లో పెట్టుబడుల పెట్టేందుకు, గత ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఆ సంస్థ ముందుకు వచ్చింది. మొత్తంగా, రూ.2,200 కోట్ల పెట్టుబడులతో, 7 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంలో, ఒప్పందం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన వెంటనే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, అప్పట్లో చంద్రబాబు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇచ్చిన భూములు సమీక్షించి, కొన్ని కంపెనీల ఒప్పందాలు రద్దు చేసారు. అందులో ఒకటి దుబాయ్‌కు చెందిన కంపెనీ ‘లూలూ’ గ్రూప్

lulu 12122019 3

వారికి వైజాగ్ లో కేటాయించిన భూమి రద్దు చేసారు. దీంతో ‘లూలూ’ గ్రూప్ ఒక ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మేము ఇండియాలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కాని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెట్టం అంటూ, ఒక బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేసారు అంటే, వాళ్ళు ఎంత ఆందోళన చెందారో అర్ధం అవుతుంది. అయితే, ఇప్పుడు ‘లూలూ’ గ్రూప్ కంపెనీ, అనూహ్యంగా తెలంగాణాలో పెట్టుబడులు పెడుతుంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో లూలూ గ్రూప్ కు హైదరాబాద్ శివార్లలో 290 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ సంస్థ తెలంగాణాలో 2500 కోట్ల పెట్టుబడి పెడుతుండడం విశేషం. అయితే ఆంధ్రప్రదేశ్ కు రావలసిన కంపెనీ, తెలంగాణాకు వెళ్ళిపోవటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ పడుతున్నారు. మనల్ని హేళన చేసిన తెలంగాణా పెద్దలు, మన పతనాన్ని ఎంజాయ్ చేస్తున్నారని, ప్రజలు అనుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read