ఏపీలో సీఎం వర్సెస్ ఈసీగా కోల్డ్ వార్ సాగుతున్న నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను కేంద్రానికి నివేదించేందుకే ఎల్వీ ఢిల్లీ వెళ్లారా అన్న చర్చ సాగుతోంది. పైకి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లినట్లు చెబుతున్నా... రాష్ట్రంలో రివ్యూ మీటింగ్స్ విషయంలో సాగుతున్న రచ్చపై ఫిర్యాదు చేసేందుకే వెళ్లారా అన్న వాదన వినిపిస్తోంది. ఢిల్లీ చెప్పినట్టు ఆడుతూ, తన పరిధికి మించి, కొన్ని పాలనాపరమైన సమీక్షలు నిర్వహించే విషయంలో, తీవ్ర అభ్యంతరం చెప్తున్నా సీఎం చంద్రబాబు, ఆయన కేబినెట్ మంత్రులపై సహజంగానే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గుర్రుగా ఉన్నారు.

cs 25402019

ఢిల్లీ చెప్పినట్టు ఆడటానికి, ఈసీ గత సీఎస్ పునేఠాను తప్పించి ఆయన స్ధానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. దీనిపై సీఎం చంద్రబాబు బహిరంగంగానే విరుచుకుపడ్డారు. జగన్ కేసుల్లో నిందితుడికి సీఎస్ పగ్గాలు ఎలా అప్పజెబుతారంటూ నిప్పులు చెరిగారు. పోలవరం, సీఆర్డీఏపై సీఎం నిర్వహించిన సమీక్షలపై ఈసీ సీరియస్ కావడంతో సదరు సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత తానే సమీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. దీనిపైనా టీడీపీ మంత్రులు విమర్శలకు దిగుతున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ ఉండగా, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ సీఎంతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

cs 25402019

తాజాగా ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ లో కేటాయింపులున్నా ప్రభుత్వ పథకాలకు నిధులు జారీ చేయడం లేదంటూ సీఎస్ పై నిప్పులు చెరిగారు. ఈ దశలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. పైకి గ్రీన్ ట్రిబ్యునల్ మీటింగ్ కు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు చెప్పినా... ఢిల్లీ పెద్దలను కలిసి రాష్ట్రంలో పరిస్ధితులను వివరించాలనే ఉద్ధేశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తన పై చేస్తున్న విమర్శలను ఆయన ఈసీ లేదా కేంద్ర హోంశాఖ పెద్దలకు నివేదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుని మరింత ఇబ్బంది పెట్టటానికి, రాష్ట్రపతి పాలన పెడతారంటూ, లీకులు కూడా ఢిల్లీ నుంచి వస్తున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read