మ‌హానాడులో తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో ప్ర‌క‌టించ‌నున్నారు. ఇది ఏపీలో పెను సంచ‌ల‌నానికి దారి తీయ‌నుంది. మేనిఫెస్టో ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉండ‌బోతోందో పాద‌యాత్ర‌లో నారా లోకేష్ హింట్ ఇచ్చారు. మ‌హానాడులో యువ‌త‌కి చంద్ర‌బాబు యువ‌త‌కి అద్భుత‌మైన వ‌రం ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని లోకేష్ చెప్ప‌క‌నే చెప్పారు. ఈ సారి టిడిపి మేనిఫెస్టో మహిళలు, రైతులు, యువతకు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. పూర్తిస్థాయి మేనిఫెస్టో మ‌హానాడులో ప్ర‌క‌టించ‌క‌పోయినా, ప్ర‌ధాన‌మైన హామీలు మాత్రం అధినేత ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. టిడిపి ఆవిర్భ‌వించి 40 ఏళ్లు పూర్తికావ‌డం, ఇదే ఏడాది వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌రం కావ‌డంతో తెలుగుదేశం పార్టీ పండ‌గ మ‌హానాడుని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించే మేనిఫెస్టో ప్ర‌ధాన అంశాల‌పై పూర్తి క‌స‌ర‌త్తు జ‌రిగింద‌ని తెలుస్తోంది. అధినేత చంద్ర‌బాబు వ‌రాల జ‌ల్లు కురిపించేలా ప్ర‌ధాన హామీలు వేదిక‌పై నుంచి ఎనౌన్స్ చేయ‌నున్నారు. మ‌హానాడులో 25కి పైగా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.
ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించిన 15, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 6 తీర్మానాలు, 4 ఉమ్మడి తీర్మానాలు ఉంటాయి. ఈ నెల 27న ప్రతినిధుల సభలో తీర్మానాలు ప్రవేశపెడతారు. 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా భారీ బహిరంగ సభకి 15 లక్షల మంది హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ బ‌హిరంగ‌స‌భ‌లోనే మేనిఫెస్టోలో ప్ర‌ధాన అంశాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read