దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో వారంలో రాబోతున్నాయి. తాము మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని, ప్రజా తీర్పు తమవైపే ఉందని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. తమకు 300కుపైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతుండగా, అంత సీన్ లేదని అంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. ఆ పార్టీ సెంచరీ కూడా కొట్టలేదని, వంద సీట్లు కూడా వచ్చే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో బీజేపీ ఖాతా కూడా తెరవదని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఓ 20 సీట్లు వస్తాయని, మొత్తంగా ఈసారి 200 సీట్లను ఆ పార్టీ కోల్పోతుందని చెప్పుకొచ్చారు. కాగా, ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే తమకు 23 స్థానాలు వస్తాయని కమలనాథులు ధీమాగా ఉన్నారు.

game 27032019

పశ్చిమ బెంగాల్‌లో మంగళ, బుధవారాల్లో హింస చోటుచేసుకోవడంతో స్పందించిన ఎన్నికల సంఘం గడువుకు ఒక రోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని ఆపివేయాలని ఆదేశించింది. దీంతో మమత బెనర్జీ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. కాగా, బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గాను ఆదివారం జరగనున్న తుది విడతలో మిగతా 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని టీఎంసీ గూండాలు ధ్వంసం చేశారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. మోదీ అబద్ధాలకోరు అని అన్నారు. మోదీ తన ఆరోపణలను నిరూపించుకోవాలని... లేని పక్షంలో ఆయనను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. విగ్రహాన్ని పునర్నిర్మించే డబ్బు బెంగాల్ వద్ద ఉందని... కానీ, 200 ఏళ్ల వారసత్వ సంపదను మోదీ మళ్లీ తీసుకురాగలరా? అని మమత ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలే విగ్రహాన్ని కూల్చారనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని... కానీ మోదీ మాత్రం టీఎంసీనే ఆ పని చేసిందని అంటున్నారని మండిపడ్డారు. ఇలా మాట్లాడటానికి మీరు సిగ్గుపడటం లేదా? అని ఆమె ప్రశ్నించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read