ఈ రోజు అసెంబ్లీలో సున్నా వడ్డీ పై చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, నేను చెప్పాల్సింది చెప్పేసా, ఇక ఈ అంశం పై చర్చ వద్దు, చంద్రబాబుకి మళ్ళీ అవకాసం అవసరం లేదు అని చెప్పగానే, స్పీకర్ కూడా ఈ చర్చ ముగించి, చంద్రబాబుకి అవకాసం ఇవ్వకుండా చేసారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యలు తాము చెప్పాలనుకుంది, మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు జగన్ వైఖరిని తప్పు పట్టారు. జగన్ మోహన్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించి, అవాస్తవాలు చెప్పి, ఛాలెంజ్, ఛాలెంజ్ అని చెప్పి, ఈ రోజు నేను మాట వరుసకి అన్నాను, మీరు తక్కువ కేటాయించారు అని చెప్తున్నారని, నిన్న ఛాలెంజ్ అని పది సార్లు అని, ఈ రోజు ఇలా పారిపోయారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఒక్క విషయం పై కూడా అవగాహన లేదని, అతనికి సభలో ఏమి జరుగుతుందో కూడా తెలియదని అన్నారు. మేము అన్ని లెక్కలతో, ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చామో చెప్పమని, జగన్ సున్నా వడ్డీ రుణాల పై అవాస్తవాలు చెప్పారని అచ్చెంనాయుడు అన్నారు.

జగన్, నేను మడం తిప్పను అంటాడు, మాట మీద నిలబడే వాడివి అయితే 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి, పౌరుషం ఉంటే రాజీనామా చెయ్యండి అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మేం తలచుకుంటే మీరు ఉండరని జగన్‌ అనడం అతని నైజాన్ని తెలియచేస్తుందని అన్నారు. ఈ సమయంలో, తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ఓ మీడియా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. అచ్చెన్నాయుడు మాటలకు ఆ మీడియా ప్రతినిధి అడ్డుతగిలారు. దీంతో బుచ్చయ్య చౌదరి కల్పించుకుని విలేఖరులు కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఇదేమి పధ్ధతి అని అన్నారు. ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి రాజీనామాను మేం కోరుకోవడం లేదని, వారు చాలెంజ్‌ చేశారు కాబట్టే ఈ ప్రస్తావన తెస్తున్నామని అన్నారు. మమల్ని రౌడీలు అని జగన్ అంటున్నారు, రికార్డులు తిరగేస్తే ఎవరు రౌడీలో, ఎవరు హంతకులో తెలుస్తుందని బుచ్చయ్య చౌదరి అన్నారు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read