మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి, మంత్రి గౌతం రెడ్డి పై విరుచుకు పడ్డారు. ఆయన మాటల్లోనే "రెండేళ్ల వైసీపీ పాలనలో ఏఏ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో మంత్రి గౌతంరెడ్డి సమగ్ర వివరాలు అందించాలి. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వంటి ప్రతిష్టాత్మక సదస్సులకు వెళ్లి, సీఐఐ సమావేశాలు ఏర్పాటు చేసి పెట్టుబడి దారులను ఆకర్షించి రాష్ట్రానికి తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఆదాయం లేకుండా పోయింది. రాజధాని లేని రాష్ట్రానికి ఆదాయం రావాలంటే పరిశ్రమల స్థాపన ఎంతో అవసరమని చంద్రబాబు భావించారు. కియా, అశోక్ లేల్యాండ్ , హీరో మోటార్స్, ఇసుజు, అపోలో టైర్స్, మోహన్ స్పిన్ టెక్స్, వాల్ మెట్ ఇంజనీరింగ్ కంపెనీ, మాడ్యూ సిరామిక్స్ కంపెనీ, యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్ ప్రైవేటు లిమిటెడ్ , హ్యూందయ్ ట్రాన్సిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, కేఎస్ హెచ్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్, సియోన్ ఇ-హ్వ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు పేరొందిన కంపెనీలు చంద్రబాబు తెచ్చినవే. ఈ రెండేళ్లలో రూ. 30,000 కోట్ల పెట్టుబడులు, 64 కంపెనీలను రాష్ట్రానికి తెచ్చామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. రెండేళ్లలో ఒక్క ఐటీ పాలసీ తెచ్చారా? ఇండస్ట్రియల్ పాలసీ ఉందా? గత ప్రభుత్వంలో కట్టిన భవనాలకు వైసీపీ రంగులు వేసుకున్నట్టే.....మా హయాంలో ఉత్పత్తి మొదలుపెట్టిన పరిశ్రమలను మీరే తీసుకొచ్చి ప్రారంభించినట్టు ప్రచారం చేసుకోవడం దివాళాకోరుతనం. మీ దగ్గర ఏమైనా మంత్ర దండం ఉందా? ఆ మంత్ర దండం ఎలా వాడుతున్నారో మోదీ గారికి కూడా చెప్పండి. మీరు పరిశ్రమలు తెచ్చుంటే ఏపీలో 13.5 శాతం నిరుద్యోగం ఎందుకుంది?

mekapai 10062021 2

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018-19 లో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి రేటు 10.24 ఉండగా, రాష్ట్రాభివృద్ధి రేటు 10శాతంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ వరుసగా నాలుగేళ్లపాటు సగటు 10.52శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. విశాఖ-చెన్నయ్, చెన్నయ్-బెంగుళూరు, హైదరాబాద్-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు కార్యరూపంలోకి తెస్తూ పారిశ్రామికాభివృద్ధిని టీడీపీ ప్రోత్సాహకాలు అందించగా ఈ రెండేళ్లలో కారిడార్ల పరిధిలో నిర్దేశించిన భూసేకరణ 20శాతం కూడా ప్రభుత్వం పూర్తిచేయలేదు. రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడంపై ప్రభుత్వానికి దృష్టి లేదు. నిధులను పక్కదారి మళ్లించడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. మూడు రాజధానుల నిర్ణయంతో 2 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కు పోయాయి. పోర్టులు ఇష్టానుసారంగా బంధువులకు ఇచ్చారు. పారిశ్రామిక వేత్తలను బెదిరింపులకు గురిచేశారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైలు పాల్జేయడం పక్కనపెట్టి పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెట్టండి. కరోనా లేకపోతే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని రోడ్డున నిలబెట్టేవారు. కరోనా ముసుగులో నిధులను దారి మళ్లిస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ ను చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టీడీపీ హయాంలో మూడు సమ్మిట్ లలో చేసిన ఎంవోయూల పరిస్థితి ఏంటి? ఇకనైనా కక్షసాధింపు చరన్యలకు స్వస్థి పలికి పారిశ్రామిక వేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించండి. వారిలో నమ్మకం కల్పించండి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read