ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సన్ రైజ్ స్టేట్ అని, పెట్టుబడులు అకార్షించే ప్రదేశం అని గతంలో పేరు ఉండేది. పెద్ద పెద్ద రాష్ట్రాలను దాటుకుని కియా లాంటి అతి పెద్ద విదేశీ కంపెనీని ఆకట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, కియా, అపోలో టైర్స్, ఇసుజు, డిక్సన్, టీసిఎల్, సోలార్ పార్క్, ఇలా ఒకటి కాదు రెండు కాదు, భారీ భారీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించి, యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేసారు. దీంట్లో ప్రధాన పాత్ర ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఆయనకు ఉన్న అనుభవంతో, కొత్త రాష్ట్రం అయినా, మౌళిక సదుపాయాలు సరిగ్గా లేకపోయినా, ఆయన కంపెనీలు తేవటంలో ముందున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సరిగ్గా పారిశ్రామిక వృద్ధి పరుగులు పెడుతున్న సమయంలో, ప్రభుత్వం మారింది. చంద్రబాబు అధికారం కోల్పోయి, జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన వచ్చి కూడా రెండేళ్ళు అయ్యింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, అప్పటి నుంచి పారిశ్రామిక రంగం తగ్గుతూ వచ్చింది. నెగటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. ఒక్క కొత్త కంపెనీ రాలేదు. ఒక్క కొత్త ఉద్యోగం రాలేదు. వాలంటీర్ ఉద్యోగాలు తప్ప. ఇలా అనేక విధాలుగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు నుంచి బయట పడటానికి, జగన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది.

mekapati 090620021 2

ఇందులో భాగంగానే ఈ రోజు మంత్రి గౌతం రెడ్డి చేసిన ట్వీట్ ఆయన్ను నవ్వులు పాలు చేయటమే కాకుండా, ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేసింది. మొత్తం 30 వేల కోట్లు పెట్టుబడి వచ్చింది అంటూ గౌతం రెడ్డి ప్రకటించారు. అయితే కంపెనీలు పేర్లు చెప్పండి అంటూ గోల గోల అవ్వటంతో, ఆయన చివరకు కంపెనీల లిస్టు పెట్టారు. అయితే ఆ లిస్టు మొత్తం చూసి, అందరూ అవాక్కయ్యారు. ఎందుకుంటే అందులో కియా ఉంది, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, isuzu, అపోలో టైర్స్, మోహన్ spintex, Tory, TCL, కియా అనుబంధ సంస్థలు ఇలా అనేక కంపెనీలు పేర్లు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఇవన్నీ చంద్రబాబు హాయాంలో వచ్చినవే. అప్పటికే అవి ప్రారంభం కూడా అయ్యాయి. ఇక ఆయన పెట్టిన లిస్టు లో, దాదాపుగా 90 శాతం కంపెనీలు చంద్రబాబు హాయంలో వచ్చినవే. దీంతో మేకపాటి ట్వీట్ చూసి పలువురు షాక్ అయ్యారు. అలా ఎలా అసత్యాలు చెప్తారు అంటూ కౌంటర్ ఇద్దాం అనుకుంటే, ఆయన ట్వీట్ కు రిప్లై ఆప్షన్ కూడా తీసేశారు. మరి దీని పై ప్రభుత్వం, ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read