సోషల్ మీడియాలో సంచలన ఫోటోలు తిరుగుతున్నాయి. నిన్న శాసనమండలిలో, మంత్రులు, వైసీపీ సభ్యులు, బెంచీలు, కుర్చీలు ఎక్కి, మండలి చైర్మెన్ ను బెదిరుస్తున్న ఫోటోలు ఉన్నాయి. బొత్సా బెంచీ ఎక్కి చైర్మెన్ పై వేలు చూపిస్తూ ఉండగా, కొడాలి నని, కుర్చీ ఎక్కి, మండలి చైర్మెన్ ని బెదిరిస్తున్నట్టు ఆ ఫోటోలలో ఉంది. ఎవరు తీసారో కాని, ఈ ఫోటోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిన్న లోకేష్ ఫోన్ ఉపయోగించి, తమను ఫోటోలు తీస్తున్నారని, మంత్రులు లోకేష్ పై దాడి చెయ్యబొగా, లోకేష్ అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. బహుసా ఇవి లోకేష్ తీసిన ఫోటోలు ఏమో అని, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మొత్తానికి, నిన్నటి నుంచి వైసీపీ మంత్రులు చెపుతున్నని అన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ఈ ఫోటోలను చూస్తే, ఈ రోజు వార్తా పత్రికల్లో, మండలి చైర్మెన్ ను మంత్రులు బెదిరించారు అనే న్యూస్ నిజమే ఏమో అని అనిపిస్తుంది. నిన్న కరెంటు తీసి, వైఫై తీసి, లైవ్ ప్రసారాలు ఆపేసింది ఇందుకేనా అనే అనుమానం కలుగుతుంది.

botsa 23012020 2

నిన్న, రాజధానుల వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఉద్రిక్త పరిస్థి తులో చోటు చేసుకున్నాయి. ఒక దశలో పోడియం వద్దకు కొంత మంది మంత్రులు దూసుకువచ్చారు. పోడియం వద్ద మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మంగళవారం అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లు లపై బుధవారం మండలిలో చర్చ జరిగింది. అనంతరం ఈ బిల్లు లను ఆమోదించాలని మంత్రులు ప్రతిపాదించారు. అయితే దీనిని టీడీపీ సభ్యులు విభేదించించారు. ఈ బిల్లులకు సవరణలు ప్రతిపా దిస్తూ, సెలక్ట్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. మండ లిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రెండు బిల్లులకు వేర్వేరుగా సవరణలతో సెలక్ట్ కమిటీకి పంపాలని సవరణ లను సోమవారమే చైర్మనకు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠపై ప్రభావం చూపించే బిల్లులని, రాజధాని తరలింపు అంటే జోక్ కాదని వ్యాఖ్యానించారు. మండలిలో 22 మంది మంత్రులకు ఏమి పని అని ప్రశ్నించారు. సభ్యులైన ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన వారిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు.

botsa 23012020 3

ఈ దశలో మండలి చైర్మన్ షరీఫ్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ రూల్ 71పై చర్చ సందర్భంగా అసాధారణ నిర్ణయం తాను తీసుకు న్నానని వివరించారు. నోటీపై చర్చ తరువాత రెండు బిల్లులను ప్రవే శపెట్టాలనుకున్నానని తెలిపారు. సెలక్ట్ కమిటీకి సవరణలను ఎమ్మెల్సీ అశోక్ బాబు తనకు ఇచ్చారని తెలిపారు. చైర్మన్ ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోడియంలోకి దూసుకువెళ్లి, చైర్మన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో మిగిలిన మంత్రులు కూడా పోడియం లోకి దూసుకువెళ్లారు. వెలను చుట్టుముట్టి చైర్మన్ పై అధికార పక్ష మంత్రులు ఒత్తిడి తేవడాన్ని గమనించిన టీడీపీ సభ్యులు కూడా పోడియంలోకి వచ్చారు. సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని మంత్రలు నినాదాలు చేయడం ప్రారంభిం చారు. మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స తది తరులు టీడీపీ సభ్యులు బుద్దా వెంకన్న, లోకేష్ తదితరులపైకి దూసుకువచ్చారు. ఈ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

botsa 23012020 4

మంత్రి రంగనాథరాజు, మోపిదేవి జోక్యం చేసుకుని మంత్రులను అడుకుని తోపులాట నుంచి బయటకు తీసుకువచ్చారు. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుం డగా, మంత్రులు, ఇతర వైకాపా సభ్యులు చైర్మనను వాదనకు దిగారు. దీనిని గమనించిన టీడీపీ సభ్యులు చైర్మన్ పై దాడి చేయవ ద్దంటూ నినాదాలు చేశారు. ఈ దశలో యనమల జోక్యం చేసుకుని సభ్యులు కాని వారిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. 22 మంది మంత్రులకు మండలిలో పని ఏమిటని ప్రశ్నించారు. మండలి కార్యకలాపాలు చూసేందుకు చంద్రబాబు వచ్చారని అధికార పక్షం, వైకాపా నేతలూ వచ్చారని ప్రతిపక్షం పరస్పర విమర్శలు చేసుకోవ డంతో సభలో గందరగోళం నెలకొంది. ఎవరు ఏమి మాట్లాడుతు న్నారో తెలియని స్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు బిల్లు లను సెలక్ట్ కమిటీకి పంపాలని, సరైన సమయంలోనే తాము సవర ణలు ఇచ్చామని తెలిపారు. చైర్మన్ తప్పు చేస్తే, తమ తప్పు లేదని తెలిపారు. సెలక్ట్ కమిటీ పంపండంపై ఓటింగ్ నిర్వహించాలని పట్టు బట్టారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు, నినాదాలతో సభలో గంద రగోళం నెలకొంది. సభలో ఆర్డర్ లో లేనందున 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read