నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఒక పంచాయతీ జరుగుతుంది. అక్కడ దళితులు కింద కాళ్ళ పై కూర్చుని ఉంటే, గ్రామ పెద్దలు వారి ఎదురుగుండా రచ్చబండ పై కూర్చుని, పంచాయతీ చేస్తున్నారు. ఇందులో, ఒక గ్రామ పెద్ద, దళితురాలు అయిన ఓక మైనర్ బాలిక పై విచాక్షణారహితంగా కొడుతున్నట్టు వీడియోలో కనిపించింది. చెంప మీద ఆపుకుండా కొడుతూ, తరువాత కర్రతో కొడుతూ, చివరకు ఆ పిల్లని కాళ్ళతో చాతీ పై కొట్టాడు ఆ గ్రామ పెద్ద. అయితే ఈ వీడియో గురించి పూర్తీ వివరాలు నిన్న తెలియలేదు. కాని ఈ వీడియో, నిన్నటి నుంచి పూర్తిగా వైరల్ అవ్వటంతో, అటు మీడియా, ఇటు పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ వీడియో పై అసలు ఏమి జరిగింది అనే విషయం పై ఆరా తీసారు. అయితే, ఈ విషయం జరిగిన తీరు చూసి అందరూ అవాక్కయ్యారు.

minor 17082019 2

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో, గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. ఇద్దరూ దళిత వర్గానికి చెందిన వారే. ఇంట్లో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోక పోవటంతో, మూడు రోజుల క్రిందట ఇంట్లో నుంచి ఇద్దరూ కలిసి పారిపోయారు. అయితే, వారిని వెతికి పట్టుకుని, కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. విషయం గ్రామ పెద్దలకు చెప్పారు. అయితే, ఇక్కడ గ్రామ పెద్దగా ఉన్నది, వైసీపీ నాయకుడు, బ్రహ్మానందరెడ్డి, మరో వైసీపీ నాయకుడు లింగప్ప. బ్రహ్మానందరెడ్డి ఎంపీటీసీ సభ్యుడిగా కూడా పని చేసారు. అయితే, ఈ విషయం తెలియగానే, వీరు తమ కుల అహంకారాన్ని చూపిస్తూ, అక్కడ ప్రవర్తించిన తీరు ఆక్షేపనీయం. ఆ మైనర్ బాలికను మరోసారి ఇలా చెయ్యద్దు అంటే, ఆ బాలిక మాత్రం, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

minor 17082019 3

నేను చెప్పినా వినవా, నా మాటకే ఎదురు చెప్తావా అని, ఆ బాలిక పై విచక్షణారహితంగా దాడి చేసారు, ఆ వైసిపీ నాయకుడు. అయితే ఈ విషయం వైరల్ అవ్వటంతో, దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. చిన్న పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాలి కానీ, ఇలా గొడ్డుని బాదినట్టు, అందరి ముందు కొడతారా, అతన్ని అరెస్ట్ చెయ్యాలని ఆందోళన చేసారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ చట్టం కింద కొట్టిన వారి పై కేసు నమోదు చేశారు. లింగప్పను అరెస్టు చేస్తామని చెప్పారు. అలాగే ఆ బాలికను ప్రేమించిన బాలుడి పై కూడా పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్‌ వెంకటచలపతి, సీఐ రాజులు బాధిత మైనర్‌ బాలిక ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read