ఇప్పటి వరకు ఇచ్చిన లాక్ డౌన్ కు సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్రం, సోమవారం నుంచి, డొమెస్టిక్ ఫ్లైట్స్ అనమతి ఇస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ప్రకారం, అన్ని రాష్ట్రాలు, అనుమతి ఇచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు మాత్రం, తమ రాష్ట్రంలో అధికంగా కేసులు ఉండటంతో, ఇప్పుడే మాకు వద్దు అని చెప్పాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా, ఫ్లైట్ షడ్యుల్ ఇచ్చేసారు. చాలా మంది బుక్ కూడా చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లలో షడ్యుల్ కూడా విడుదల అయ్యింది. అయితే ఏమైందో ఏమో కాని, నిన్న రాత్రి 9 గంటలు తరువాత, ఏపిలో ఫ్లైట్స్ అన్నీ, ఒక రోజు వాయిదాతో, మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయని వార్తలు వచ్చాయి. అలాగే పౌరవిమానయాన మంత్రి హర్దీ‌ప్‌సింగ్‌ పురి కూడా ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఒక రోజు వాయిదా వేసి, మంగళవారం నుంచి నడుపుతాం అని చెప్పింది అని, అందుకు కేంద్రం ఒప్పుకొంది అని చెప్పారు.

అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. కేవలం చంద్రబాబు అనే ఒక్కడిని విశాఖపట్నం రాకుండా ఉండటానికి, ఇన్ని కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తుంది. పోలేసులు చేత పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి, ఇప్పుడు కేవలం ఒక్క రోజు వాయిదా అంటూ నాటకాలు ఆడుతున్నారని, షడ్యుల్ ఇచ్చి, చివరి నిమిషంలో రద్దు చేసేంత ఎమర్జెన్సీ ఏమి వచ్చింది అని అన్నారు. ఇది కేవలం చంద్రబాబుని అడ్డుకోవటం కోసమే అని అన్నారు. మహానాడు 27, 28న ఉంటుంది అని, 26న వైజాగ్ వెళ్ళటం కుదరదు కాబట్టి, చంద్రబాబు ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకుంటే, కావాలని ఆపారని అన్నారు. ఒక రోజు ఆపగలరు, రెండు రోజులు ఆపగలరు, ఈ రోజు కాకపొతే, మరో రోజు వెళ్తామని తెలుగుదేశం నేతలు అంటున్నూర్.

గతంలో కూడా వైజాగ్ లో అడుగుపెడితే అడ్డుకున్నారు, ఇప్పుడు రెండో సారి దొంగదారిలో అడ్డుకున్నారని, ఎందుకు ఒక రోజు ఫ్లైట్స్ రద్దు చేసాం అనేది ఇప్పటి వరకు చెప్పలేదని అచ్చంనాయడు అన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు వైజాగ్ వెళ్ళటానికి, తెలంగాణా డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసారు. తెలంగాణా నుంచి వెంటనే అనుమతి రాగా, ఏపి పోలీసులు నిన్న సాయంత్రం అనుమతి ఇచ్చారు. అయితే అంతకు ముందు హోం మంత్రి సుచరిత, చంద్రబాబు అసలు మమ్మల్ని అడగలేదని, అడిగితే పర్మిషన్ లెటర్ చూపించాలని అన్నారు. అయితే హోంమంత్రి చెప్పిన 3,4 గంటల్లోనే, డీజీపీ చంద్రబాబు 23వ తారీఖు అనుమతి అడిగినట్టు, ప్రత్యెక పరిస్థితిలో, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పారు. అయితే విశాఖలో మాత్రం, ఫ్లైట్స్ లేని కారణంగా, చంద్రబాబు పర్యటన రద్దు చేసుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read