అమ‌రావ‌తి వాయిస్ రాసిందే నిజ‌మైంది. అమ‌రావ‌తి వెబ్ సైటు విశ్లేష‌ణే అక్ష‌రాలా వాస్త‌వ‌మైంది. ఉత్త‌రాంధ్రలో ప‌ట్ట‌భ‌ద్రులు ప్ర‌భుత్వంపై ఉవ్వెత్తున విరుచుకుప‌డుతున్నారు. ఆంధ్రాలో అరాచ‌క పాల‌న‌పై ఆక్రోశం వెల్ల‌గ‌క్కుతున్నారు. రాయ‌ల‌సీమ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా టిడిపి వైపు చూస్తున్నాయి. ప‌ట్ట‌భ‌ద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓటింగ్ స‌ర‌ళి చూస్తుంటే ప్ర‌భుత్వంపై ప్ర‌జావ్య‌తిరేక‌త ఏ రేంజులో ఉందో అర్థం అవుతోంది. విశాఖ రాజ‌ధాని అని ఊరిస్తున్నా ఉత్త‌రాంధ్రులు న‌మ్మ‌డంలేదు. క‌ర్నూలు న్యాయ‌రాజ‌ధాని అని ఆశ పెట్టినా సీమ‌వాసులు క‌రుణించ‌లేదు. అమ‌రావ‌తి ఆగ్ర‌హ‌జ్వాల‌లు స‌రేస‌రి. ల‌క్ష‌లాది మంది నిర‌క్ష‌రాస్యుల‌ని ప‌ట్ట‌భ‌ద్ర ఓట‌ర్లుగా చేర్పించామ‌ని, కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని, ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని మేనేజ్ చేశామ‌ని సంబ‌ర‌ప‌డుతోన్న అధికార వైసీపీకి ప్ర‌జ‌లు షాకిచ్చారు. మూడు స్థానాల్లోనూ టిడిపి అభ్య‌ర్థుల‌కి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఎన్నిక‌ల‌కి ముందు అమ‌రావ‌తి వాయిస్ ప‌ట్ట‌భ‌ద్రులు తెలుగుదేశానికి ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌ని రాసిన క‌థ‌నం లింక్ ఇది.. https://www.amaravativoice.com/avnews/news/mlc-elections-tdp-edge

ఏపీలో వైసీపీ ధీమా స‌డ‌లుతోందా? వైనాట్ 175 మేకపోతు గాంభీర్య నినాద‌మేనా? ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానాల‌కి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డ‌టంతో వైసీపీ పెద్ద‌ల్లో ఆందోళన నెల‌కొంది. దింపుడు క‌ల్లం ఆశ‌లు దొంగ ఓట్ల‌పై పెట్టుకోవ‌డం వైసీపీ తిరోగ‌మ‌నానికి సంకేతం అని అంటున్నారు. ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌న్నీ కూడ‌బ‌లుక్కుని మ‌రీ వైసీపీని ఓడించాల‌ని త‌మ గ్రూపుల‌లో నేరుగానే సందేశాలు పంపేశాయి. ఉద్యోగాల భ‌ర్తీ లేక‌పోవ‌డంతో ప‌ట్ట‌భ‌ద్రుల‌లో తీవ్ర నిరాశానిస్పృహ‌లు అలుముకున్నాయి. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ స్థానాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోలింగ్ న‌మోదైంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాద్యాయులు ఇంత వ్య‌తిరేకంగా ఉన్న ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో గెలిచే అవ‌కాశంలేదు. కానీ వైసీపీ ఇటువంటి ప్ర‌జావ్య‌తిరేక‌త‌ని ఊహించే భారీగా దొంగ ఓట్లు చేర్పించింది. ఇప్పుడు గెలుపు ధీమా అంత ఆ దొంగ ఓట్ల‌పైనే పెట్టుకుంది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగ్గా ఉపాధ్యాయ ఓటర్లు 91.40శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఉపాధ్యాయులు కానివారిని, ప్రైవేటు స్కూళ్ల‌లో ప‌నిచేసిన వారిని వైసీపీ త‌మ వాలంటీర్ల ద్వారా ఓట‌ర్లుగా చేర్చింద‌ని ఉపాధ్యాయ‌సంఘాలు ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకునే అధికారే లేడు. ఈ దొంగ ఓట్ల‌పైనే వైసీపీ గెలుపు ఆశ‌లు పెట్టుకుంది. పట్టభద్రులు కూడా గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా 69.23 శాతం మంది, ఎండ‌లో గంట‌ల త‌ర‌బ‌డి నిలుచుని మ‌రీ త‌మ ఓటుహ‌క్కుని వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెర‌గ‌డం, అందులోనూ యువ‌త‌, ఉద్యోగులు పోటెత్త‌డంతో ప్ర‌భుత్వంపై కోపంతోనే ఓటింగ్‌కి వ‌చ్చార‌ని, ఇది క‌చ్చితంగా వైసీపీకి ఓట‌మి ఎదురు కావొచ్చ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే తిరుప‌తి, రాయ‌ల‌సీమ‌లో దొంగ ఓట్ల‌ని, ఉత్త‌రాంధ్ర‌లో తాము పంచిన తాయిలాలు, డ‌బ్బుల‌నే న‌మ్ముకుని వైసీపీ గెలుపు అంచనాల్లో ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read