రాజధాని తరలింపు, సీఆర్డీఏ బిల్లుల్ని అసెంబ్లీలో మందబలంతో ఆమోదించిన అధికారపార్టీ మండలిసాక్షిగా ఛైర్మన్‌పై దూషణలకు దిగుతూ, దాడికి ప్రయత్నించిందని టీడీపీసీనియర్‌నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వాపోయారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో సహచర ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అశోక్‌బా బు, మంతెన సత్యనారాయణరాజులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండలిలో రూల్‌-71పై చర్చ జరుగుతుండగానే, ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి లాబీల్లో కూర్చొని సైగలుచేస్తూ కనిపించాడన్నారు. మండలి సభ్యుల్ని కొనుగోలు చేయడానికి వచ్చిన విజయసాయి, పవిత్రమైన పెద్దలసభను కొనుగోలు కేంద్రంగా మార్చాడని బచ్చుల మండిపడ్డారు. అధికారపార్టీసభ్యులు, మంత్రులతో కలిసి, ఛైర్మన్‌ షరీఫ్‌ను ఒత్తిడికి గురిచేస్తూ, లేనిదాన్ని తమకు అనుకూలంగా చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటం విజయసాయికే చెల్లిందన్నారు. ఛైర్మన్‌ బాత్రూమ్‌కు వెళ్లినా వదలకుండా, షరీఫ్‌ రెండుచేతులు పట్టుకొని ఆయన్ని ప్రలోభాలకు గురిచేశాడన్నారు. మంత్రులుకూడా వీధిరౌడీలను మరిపించేలా, ఛైర్మన్‌ చేతిలోని కాగితాల్ని చించిపారేసి, ఆయనముందున్న బల్లపైకెక్కి విధ్వంసం సృష్టించారని అర్జునుడు తెలిపారు. నిబంధనలపేరుతో, తప్పుడు బిల్లుల్ని ఆమోదించుకోవడానికి దుష్టఆలోచనలతో మంత్రులు చేయాల్సిన దాష్టీకాలన్నీ చేశారన్నారు. బెయిల్‌పై తిరుగుతున్న విజయసాయిరెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ లోకి వెళ్లి, ఆయన్ని బెదిరించాడన్నారు.

బిల్లులో ఉన్న తప్పులన్నింటినీ ఛైర్మన్‌హోదాలో షరీఫ్‌ కూలంకషంగా విశదీకరించినా కూడా మంత్రులు వెనక్కుతగ్గలేదన్నారు. వైసీపీ సభ్యులంతా నిజంగా ప్రజాస్వామ్యవాదులైతే, విజయసాయిరెడ్డి చర్యలను సమర్థించరని బచ్చుల తేల్చిచెప్పారు. జేబులుకొట్టేవాళ్లు, బ్లాక్‌టిక్కెట్లు అమ్మేవాళ్లు, దాదాగిరీ చేసేవా ళ్లు రాష్ట్రానికి మంత్రులయ్యారని, వారు మాట్లాడేభాష, హావభావాలు నీచాతినీచంగా ఉన్నాయన్నారు. నిన్న ఇద్దరిని కొన్నాం.. ఈరోజు మరో ఇద్దరిని కొంటున్నాం..మీరేమి చేయలేరంటూ మండలిసాక్షిగా ప్రతిపక్షసభ్యులను బెదిరించిన విజయసాయి బెయిల్‌ని తక్షణమే రద్దుచేయాలని అర్జునుడు డిమాండ్‌చేశారు. విశాఖలో పొలాలుకొన్నంత తేలిగ్గా, మండలిలో ప్రతిపక్షపార్టీ సభ్యుల్ని కొనాలన్న తాపత్రయం ఏ2లో అడుగడుగునా కనిపించిందన్నారు. అధికారపార్టీ ఎంతగా భయపెట్టి నా, మంత్రులు ఎన్నిరకాలుగా దూషించినా, ఎక్కడా భయపడకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నిలిచిన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడుకాదని, తమపార్టీ, తమనాయకుడు నేర్పిన సభ్యత, సంస్కారం వల్లనే తామె వరమూ హద్దులు మీరడంలేదన్నారు.

ఒకపథకం ప్రకారమే మండలిలో జరిగేది బయటప్రపంచానికి తెలియకుండా చేశారని, కరెంటు తీసేసి, చీకట్లో తమపై దాడికికూడా యత్నించారని, ఘోరమైనభాష ప్రయో గిస్తూ తమను దూషించారని టీడీపీ ఎమ్మెల్సీదీపక్‌రెడ్డి తెలిపారు. మండలిలో ఏం జరుగుతుందో తెలియకూడదనే ప్రత్యక్షప్రసారం ఇవ్వకుండా, ప్రసారమాధ్యమాలను నిలిపివేశారన్నారు. ప్రజలమనోభావాల ప్రకారం ముందుకెళ్లాలని టీడీపీ సభ్యులు సూచిస్తే, దానికి విరుద్ధంగా వైసీపీమంత్రులు మండలిలో రౌడీయిజం చేశారన్నారు. ఛైర్మన్‌ ఛాంబర్‌లోకి వెళ్లి, ఆయన్ని అనరాని మాటలన్నారని, మతంపేరుతో ఆయన్ని దూషించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారికి ప్రజలెలా ఓట్లేశారో తెలియడం లేదన్నారు. పాలకులుగా ఉండి అధికారపార్టీవారు చేస్తున్న దారుణాలను ప్రజలంతా గమనించాలన్నారు. విజయసాయి సైగచేయగానే మంత్రులంతా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా తమపైకి దూసుకొచ్చారని దీపక్‌రెడ్డి వాపోయారు.

మండలిలో రాజ్యాంగఉల్లంఘన జరిగిందని మొసలికన్నీరు కారుస్తున్న మంత్రిబొత్స సత్యనారాయణకు చట్టం గురించి ఏం తెలుసునని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు పార్లమెంట్‌లో చట్టాలుచేసినప్పుడు లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుల్ని రాజ్యసభలో అనేకమార్లు తిరస్కరించడం జరిగిందని, అంతమాత్రాన దేశచరిత్రలో ఎన్నడూకూడా రాజ్యసభఛైర్మన్‌పై దాడులకు యత్నించిన ఉదంతాలు లేవన్నారు. భారతరాజ్యాంగం నుంచే చట్టాలు ఏర్పడ్డాయని, ఆచట్టాలనుమించే అధికారం ఎవరికీ ఉండదనే విషయా న్ని అధికారపార్టీసభ్యులు తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీకి ఉండే అధికారమే మండలికి కూడా ఉంటుందని, ఫైనాన్స్‌బిల్లులను ఆమోదించినంతతేలిగ్గా జనరల్‌బిల్లుల్ని ఆమోదిం చడం సాధ్యపడేదనే విషయాన్ని బొత్స గ్రహించాలన్నారు. 151మందితో బిల్లుని అమోదించే అధికారం అసెంబ్లీకి ఉన్నట్లే, బిల్లులను తిరస్కరించే అధికారం మండలికి ఉంటుందనే ఇంగితం సీనియర్‌మంత్రినని చెప్పుకుంటున్న బొత్సకు లేకపోవడం విచారకరమన్నారు. రూల్‌-71పై చర్చించాకే ఇతరబిల్లులు చర్చించాలని తాముకోరామ ని, అన్నిపార్టీలు అభ్యంతరాలు తెలిపినా, అసెంబ్లీలో ఏకపక్షంగా ఎస్సీ కమిషన్‌బిల్‌ని, ఇంగ్లీషుమీడియం బిల్లుని ఎలా ఆమోదించారో సమాధానంచెప్పాలని అశోక్‌బాబు ప్రశ్నించారు.

ఒక్కరోజులోనే హడావిడిగా, ఆఘమేఘాలపై రాజధాని తరలింపు, సీఆర్డీఏరద్దు బిల్లుల్ని అసెంబ్లీలో ఏవిధమైన చర్చలేకుండా, 10గంటల్లోనే ఎలా అమోదించారన్నారు. బిల్లుని రిజెక్ట్‌చే యమని అధికారపార్టీ సభ్యులే ఒత్తిడిచేశారని, మండలిలో రిజెక్ట్‌చేస్తే ఆవంకతో తిరిగి అసెంబ్లీలో ఫైనాన్స్‌బిల్‌గా ఆమోదముద్ర వేయించుకోవచ్చన కుటిలఆలోచన వారిలో ఉందన్నారు. చట్టప్రకారమే నడుచుకోవాలని ఛైర్మన్‌కు సూచించాము తప్ప, ఎవరు, ఏవిధమైన ఒత్తిడి చేయలేదన్నారు. బెయిల్‌పై తిరుగుతున్న వ్యక్తి, మండలిఛైర్మన్‌ ఛాంబర్‌లోకి వెళ్లి, ఆయన్ని బెదిరించడం జరిగిందన్నా రు. అసెంబ్లీ కార్యదర్శి తప్పుచేస్తే, అతనిపైచర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. బీజేపీ, పీడీఎఫ్‌, ఇతరపార్టీలుకూడా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన బిల్లులపై మండలిలో అభ్యంతరాలు వ్యక్తంచేశాయన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిందన్న ఉక్రోషంతో, మంత్రులంతా హద్దుమీరి ప్రవర్తించారన్నా రు. విజయసాయి కౌన్సిల్‌లాబీల్లో కూర్చోవడం ఏమిటని అశోక్‌బాబు ప్రశ్నించారు. ఉదయం సభప్రారంభం నుంచి, రాత్రి 9వరకు బెయిలపై ఉన్నవ్యక్తి అసెంబ్లీ ఛైర్మన్‌ ఛాంబర్‌లో ఉండటం ఎలాంటి చట్టమో బొత్స చెప్పాలన్నారు. 22మంది మంత్రులు మండలిలో చేయాల్సిన యాగీ అంతా చేశారని, వారు వాడిన పదాలు వింటే సభ్యసమాజం తలదించుకుంటుందని, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గ్యాలరీలో ఉండి మండలిలో తమసభ్యులు ఏంచేయాలో పర్యవేక్షణ చేశారన్నారు. లోకేశ్‌ని, ఇతర సీనియర్‌ ఎమ్మెల్సీలను అనరాని మాటలు అన్నారని, ప్రజలకోసం, రాష్ట్రభవిష్యత్‌కోసమే తామందరం, అధికారపార్టీ దారుణాలను నిలువరించామన్నారు. ముఖ్యమంత్రి అనుభవంలేకుండా మూర్ఖత్వంతో వ్యవహరిస్తుంటే, మంత్రులేమో ఎవరిమాటవినకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read