జమిలి ఎన్నికలు 2021, 2022లో వచ్చేస్తాయి అంటూ, గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే క-రో-నా కారణంగా ఈ చర్చ మరుగున పడింది. అయితే నెల రోజులు క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనకున్న సమాచారం మేరకు జమిలి ఎన్నికలు వచ్చే అవకాసం ఉందని, ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని, జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపు ఇచ్చారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ, ఏపి బీజేపీ నేతలు ఖండించారు. చంద్రబాబు క్యాడర్ ని కాపాడుకోవటం కోసం, ఇలా చెప్తున్నారు అంటూ, ఎన్నికలు ఇప్పట్లో రావని కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం గత కొన్ని రోజులుగా నడుస్తుంది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు పేరిట, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022 చివర్లో ఎన్నికలు పెడితే, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు లేట్ గా జరిపి, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరపాలని అనుకున్నారు. అయితే ఇదంతా చర్చ మాత్రమే. ఎక్కడా అధికారికంగా ఎవరూ ఈ విషయం చెప్పలేదు. అయితే జమిలి ఎన్నికల పై, ఈ రోజు ఏకంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయటంతో, ఇది పెద్ద వార్త అయ్యింది. ఈ రోజు గుజరాత్ లో జరిగిన రాజ్యాంగా దినోత్సవంలో మోడీ పల్గుని, ఈ వ్యాఖ్యలు చేసారు.

modi 26112020 2

జమిలి ఎన్నికలు అనేది కేవలం చర్చించి వదిలేసే విషయం కాదని, మన దేశానికి జమిలి ఎన్నికలు ఎంతో అవసరం అని ప్రధాని అన్నారు. మన దేశంలో మాటి మాటికి, కొన్ని నెలల వ్యవధిలోనే న్నికలు వస్తూ ఉంటే, ప్రతి సారి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని మోడీ అన్నారు. అందుకే ఒకేసారి ఎన్నికలు జరిపితే మనకు ఎంతో మేలని ప్రధాని అన్నారు. ఖర్చు పరంగా కూడా దేశానికీ ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అలాగే వివిధ ఎన్నికలకు వివిధ ఓటర్ లిస్టు లు ఉన్నాయని, వీటి వల్ల వ్యయం, సమయం కూడా వృధా అవుతుందని మోడి అన్నారు. మన దేశంలో లోక్ సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి రావాలని, దీని పై అధ్యయనం చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. దీంతో జమిలి ఎన్నికల పై మరో సారి చర్చ జరుగుతుంది. సాక్షాత్తు ప్రధాని నోట్లో నుంచి ఈ మాట వచ్చింది అంటే, కేంద్రం జమిలి ఎన్నికలకు రెడీ అవుతునట్టే అనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. నెల రోజుల క్రితం చంద్రబాబు చెప్పిన మాటలు నిజం అవుతాయా అనిపిస్తుంది. ఇది రాజకీయంగా బీజేపీ వేస్తున్న ఎత్తు అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జమిలి ఎన్నికల పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read