భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. ఆయన ఆస్థి రూ.2.28కోట్లు. సొంత కార్ కూడా లేదు. నరేంద్రమోదీ ఆస్తుల వివరాలను కేంద్రప్రభుత్వం తాజాగా వెల్లడించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వీటి ప్రకారం.. మార్చి 31, 2018 నాటికి ప్రధాని మోదీ చేతిలో ఉన్న డబ్బు రూ. 48,944. ఇక ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2.28కోట్లు. ఇందులో రూ. 1.28కోట్లు చరాస్థులు కాగా.. గాంధీనగర్‌లోని మోదీ నివాస స్థలం విలువ రూ. కోటి. గాంధీనగర్‌లో దాదాపు 900 చదరపు అడుగుల నివాస స్థలాన్ని 2002లో మోదీ రూ. లక్షకు కొనుగోలు చేశారు.

modi 19092018 2

ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్‌ విలువ రూ. కోటికి పెరిగింది. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ బ్రాంచీలో ప్రధాని మోదీకి ఖాతా ఉంది. మార్చి 31 నాటికి అందులో రూ. 11,29,690 నిల్వ ఉన్నాయి. ఇక ఇదే బ్రాంచీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మల్టీ ఆప్షన్ డిపాజిట్‌ స్కీమ్‌ల రూపంలో మోదీ పేరుపై రూ. 1.07కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇవి గాక.. రూ. 5.18లక్షల విలువ గల జాతీయ పొదుపు బాండ్‌, రూ. 1.59లక్షల విలువ గల జీవిత బీమా పాలసీ ఉంది. తాజా వివరాల ప్రకారం.. మోదీ పేరుపై కనీసం సొంత కారు కూడా లేదు.

modi 19092018 3

ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఆయన వద్ద రూ. 1.38లక్షల విలువ గల నాలుగు బంగారు ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. అంతేగాక.. ప్రధాని ఏ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లు కూడా తాజా వివరాల్లో లేదు. క్రితం ఏడాదితో పోల్చితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోడీ స్థిర, చరాస్తులు పెరిగాయి. ఆయన బ్యాంక్‌ ఖాతాలో నగదు నిల్వ అమాంతం 8 రెట్లు పెరిగింది. గాంధీనగర్‌(గుజరాత్‌)లోని ఎస్‌బీఐ పొదుపు ఖాతాలో నగదు నిల్వ రూ.1.33 లక్షల నుంచి రూ.11.2లక్షలకు చేరుకుంది. అలాగే రూ.90లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూ.కోటీ 7లక్షలకు చేరుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పుస్తకాలపై రాయల్టీ రూపంలో మోడీ రూ.10.23లక్షలు ఆదాయం అందుకున్నారని పేర్కొనగా, ఈసారి (2017-18) సమర్పించిన ఆదాయపన్ను రిటర్న్‌ ఫైల్‌లో దీనిని చూపలేదు. భార్య జశోదాబేన్‌ ఆదాయ, ఆస్తి వివరాలు 'తెలియవని' చూపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read