ఒడిశాలోని సంబల్ పూర్ లో పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న అధికారిని ఎన్నికల సంఘం(ఈసీ) సస్పెండ్ చేసింది. ఎస్పీజీ రక్షణలో ఉన్న నేతలపై తనిఖీలు చేపట్టవద్దనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది. మంగళవారం ప్రధాని మోదీ సంబల్ పూర్ సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన హెలికాప్టర్ లోని లగేజీని కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మొహమ్మద్ మొహసిన్ తనిఖీ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను మొహసిన్ ఉల్లంఘించినట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్పీజీ రక్షణలో ఉన్న వ్యక్తులకు సోదాల నుంచి మినహాయింపు ఉంది.

modi 19042019

సదరు అధికారికి ఒక పరిశీలకుడిగా ఆ ఆదేశాల గురించే తెలిసే ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తెలిసిన వాస్తవాల ఆధారంగా పరిశీలకుడిని సస్పెన్షన్ లో ఉంచడమే కాకుండా, సదరు విధుల నుంచి తప్పించినట్లు ఈసీ అధికారి ఒకరు తెలిపారు. సంబల్ పూర్ ను సందర్శించి విచారణ నిర్వహించి, రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్రశర్మను ఆదేశించారు. ఇది ఇలా ఉంటే, 48 గంటల వ్యవధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లలో ఎన్నికల అధికారులు దాడులు జరిపారు. మంగళవారం నాడు కర్ణాటక సీఎం కుమారస్వామి చాపర్ లో తనిఖీలు చేసి, ఒట్టి చేతులతో వెళ్లిపోయిన ఫ్లయింగ్ స్క్వాడ్, బుధవారం నాడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో తనిఖీలు చేసి అందులో ఏమీ డబ్బులు లేవని తేల్చి వెళ్లిపోయారు.

modi 19042019

నిన్న నవీన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూర్కేలా ప్రాంతానికి వెళ్లగా, చాపర్ దిగగానే, దూసుకొచ్చిన అధికారులు, తనిఖీలకు తమకు సహకరించాలని కోరారు. అందుకు నవీన్ అంగీకరించగానే, హెలికాప్టర్ ను తనిఖీ చేసి అవాక్కయ్యారు. అందులో వారికి ఏమీ దొరకలేదు. చాపర్ ను మొత్తం తనిఖీ చేసేంతవరకూ నవీన్ పట్నాయక్, అక్కడే వేచి చూశారు. దీనిపై వివరణ ఇచ్చిన ఈసీ, ఎవరినైనా తనిఖీ చేసే అధికారం ఈసీ సిబ్బందికి ఉందని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఒడిశాలోని సంబల్ పూర్ ప్రాంతానికి ప్రచారానికి వెళ్లిన మోదీ చాపర్ ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆఫీసర్ మహ్మద్ మొహిసిన్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read