నిన్న ప్రధాని మోడీ గుంటూరు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విభజన హక్కుల గురించి అడుగుతుంటే, ఆయన మాత్రం, ముందుగా లోకేష్ కి ప్రాధాన్యత ఇచ్చి, లోకేష్ భజన చేసారు. చంద్రబాబు పేరు కూడా ఎత్తే సాహసం చెయ్యక, ఆయానను ఇన్ డైరెక్ట్ గా సంబోధిస్తూ, చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలు చేసారు. టీవీ డిబేట్లలో కొట్టుకుని, చిల్లర సంత లాగా, మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే, జగన్, పవన్ కంటే దిగజారి మోడీ మాట్లాడారు. ఆయన కనీసం ప్రధాని అనే హోదా ఉండనే స్పృహ కూడా లేకుండా, మాట్లాడారు. అయితే, మోడీ ఇచ్చిన స్పీచ్, దానికి జీవీఎల్ ఓవర్ ఆక్షన్ చేస్తూ, చేసిన translationలో ఒక పాయింట్ మాత్రం మిస్ అయ్యింది. 2014లో ప్రతి మీటింగ్ లో ఇచ్చిన ఆ పిలుపు మాత్రం ఇప్పుడు మిస్ అయ్యింది.

modi guntur 11022019

ఇదే ఆ ఇంటరెస్టింగ్ పాయింట్. 2014 ఎన్నికల సమయంలో, మోడీ ఆంధ్రా వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టు లేదు. చంద్రబాబు లాంటి అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వారికి మద్దతు ఇవ్వండి, దొంగలకు వద్దు అని చెప్పారు. స్కామంద్ర చేసిన వాడిని దూరం పెట్టమన్నారు. అవినీతి చేసిన వారిని లోపల వేస్తాను అన్నారు. ఇవన్నీ మోడీ ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు జగన్ వచ్చి, మోడీ ఒడిలో కూర్చున్నారు. విజయసాయి రెడ్డి ఏమి చేసారో కాని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అనే క్రిమినల్, మోడీకి పెద్ద స్నేహితుడు అయ్యాడు. అందుకే నిన్న అంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నా, జగన్ మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. జగన్ అంటే ఎంత ప్రేమో ఇక్కడే తెలుస్తుంది.

modi guntur 11022019

జగన్ అవినీతి గురించి, జగన్ కేసుల గురించి, ఒక్క మాట కూడా మోడీ మాట్లాడ లేదు. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి కూడా, నిన్న మోడీ ఆంధ్రప్రదేశ్ వస్తే, ఎక్కడా నిరసన లేక పోగా, స్వాగతం పలికారు. మోడీ మీటింగ్ కు జనాన్ని తోలారు. నువ్వు నన్ను తిట్టద్దు, నేను నిన్న తిట్టను, ఇద్దరం కలిసి చంద్రబాబు మీద పడదాం అంటూ, ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా దొంగతనంగా, చీకటి ఒప్పందం చేసుకుని, అందరూ కలిసి చంద్రబాబు మీద పడుతున్నారు. మోడికి అంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలి, ఎదగితే గుజరాత్ కు పోటీ వస్తుంది అనే కుళ్ళు ఉంటుంది, కాని ఈ జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది ? తన కేసుల కోసం, రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని, గుజరాతీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాడు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read