తెలుగు ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసి, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ "ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను." అని ట్వీట్ చేసారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ రోజు కొత్త సంవత్సరం అయినా, కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాం అని అన్నారు. ఈ సారి, ప్రతి పండుగ లాగా, జరుపుకొలేకపోయినా, భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుందని ప్రధాని అన్నారు.

ఇక మరో పక్క, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రీ శార్వారి నామ సంవత్సరం తెలుగువారు అందరికీ శుభదాయకం కావాలి. ఈ ఉగాది మనందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. బైటకు రాకుండా ఇళ్లలోనే ఉగాదిని జరుపుకోవాలి. జాతరలకు, వేడుకలకు దూరంగా ఉండాలి. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. కుటుంబ భద్రత, సామాజిక భద్రత మనందరి సంకల్పం కావాలి. కరోనా తీవ్రత దృష్ట్యా సామాజిక దూరం పాటించాలి. డిజిటల్ సోషలైజేషన్ సద్వినియోగం చేసుకోవాలి.

‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ అని పెద్దలు చెప్పారు. ఉగాది పచ్చడిలో తీపి,చేదు,పులుపు,వగరు...షడ్రుచులు ఉన్నట్లే, మానవ జీవితంలో కష్టాలు-నష్టాలు, సుఖాలు-దు:ఖాలు కలబోసి ఉంటాయి అనేదే ఉగాది పండుగ పరమార్ధం. కష్టం వస్తే కుంగిపోకూడదు, సుఖాలకు పొంగిపోరాదనేదే ఉగాది సందేశం. విపత్తులు ఎన్ని ఎదురైనా గట్టి పట్టుదలతో ఎదుర్కొందాం. మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుదాం. ‘‘వికారి’’కి వీడ్కోలు పలుకుదాం-‘‘శార్వారి’’ని స్వాగతిద్దాం’’ అని, ఉగాది పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తెలుగువారు అందరికీ విజ్ఞప్తి చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read