దేశ ఆర్థిక వ్యవస్థలో నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీమానిటైజేషన్ ఫలితాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగాలు ఊడిపోయాయని సంచలన నివేదిక ఒకటి బయటపడింది. బెంగుళూరుకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టెయినబిలిటీ సంస్థ 2018లో నిరుద్యోగుల సంఖ్య 6 శాతం పెరిగిందని తెలిపింది. ఇది 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగిత కన్నా రెండింతలు ఎక్కువని పేర్కొంది. అంటే డీమానిటైజేషన్ అనంతరం దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగాలు ఊడాయని పేర్కొంది.

modireportcard 17042019

గత దశాబ్దంతో పోల్చితే ఈ దశాబ్దంలో నిరుద్యోగం రెండు రెట్లు పెరగడం వెనుక డీమానిటైజేషన్ ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019 పేరిట వెలువడిన ఈ రిపోర్టులో 20 నుంచి 24వయస్సు కేటగిరీలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని తెలిపింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. నిరుద్యోగ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. అయితే ఎన్నికల వేళ విడుదలైన అన్ని ప్రధాన సర్వేల్లోనూ నిరుద్యోగ అంశమే మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశంగా ఉందని తేల్చాయి. అయితే ప్రస్తుతం విడుదలైన ఈ రిపోర్టు సర్వేలను ప్రతిబింబించడం విశేషం.

modireportcard 17042019

నివేదికలోని ముఖ్యాంశాలు... ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిలో ఉన్నత విద్యావంతులే ఎక్కువ. నిరుద్యోగిత శాతం కూడా వీరిలోనే అధికంగా ఉంది. 20-24 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో నిరుద్యోగిత ఎక్కువగా నమోదవుతోంది. ఈ వయసున్న పట్టణ యువకుల్లో 60 శాతం నిరుద్యోగిత నమోదైంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉన్నత విద్యనభ్యసించిన యువకుల్లో 20% నిరుద్యోగులుగా ఉన్నారు. గత రెండేళ్ల కాలంలో ఉన్నత విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కూడా భారీగా తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణాల్లో రోజుకు రూ.500వేతనంతో సంవత్సరానికి 100రోజుల పాటు ఉపాధి కల్పించే పథకం రూపకల్పన చేయాలని రీసెర్చర్లు కేంద్రానికి సిఫార్సు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read