జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన 70 రోజుల్లోనే, అటు కోర్టుల దగ్గర నుంచి, కేంద్రం దగ్గర నుంచి, వివధ వర్గాల మేధావులు దాకా, అందరితో మొట్టికాయలు వేయించుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటి అంటే, తప్పులు చెయ్యటం కాదు. తప్పులు ఎవరైనా చేస్తారు. అందునా మొదటి సారి అధికారంలోకి వచ్చిన జగన్ తప్పులు చెయ్యటంలో ఆశ్చర్యం లేదు. అయితే ఆ తప్పులను, తప్పులు అని తెలిసినా, అందరూ అలా చెయ్యవద్దు అని చెప్పినా కూడా, వీళ్ళు మారక పొతే, అక్కడ సమస్య వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి విమర్శలే ఎదుర్కుంటుంది. చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవాలి అనే కసితో, వివాదస్పద నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, వాళ్ళు ఇబ్బంది పడటమే కాక, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని కూడా, చెడగొట్టే పరిస్థితి తీసుకువచ్చారు.

mohandas 17082019 2

తాజగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, కర్ణాటకకు చెందిన టాప్ ఇండస్ట్రియలిస్ట్, అలాగే అక్షయ పాత్ర సహ వ్యవస్థాపకుడుగా కూడా ఉన్న మోహన్‌దాస్‌ పై, తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి విధానాలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ, జగన్ పరిపాలనను, ‘ప్రభుత్వ ఉగ్రవాదం’తో పోల్చారు. సోలార్, విండ్ ఎనర్జీకి సంబంధించి, విద్యుత్ ఒప్పందాలు రద్దు/సమీక్ష చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, జపాన్ ప్రభుత్వం తప్పుపట్టిన న్యూస్ ఆర్టికల్ పోస్ట్ చేస్తూ, మోహన్ దాస్ పై ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ ఆర్టికల్ పోస్ట్ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, పెట్టుబడి దారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

mohandas 17082019 3

ఇది జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదం అని, ఇలాంటి నిర్ణయాలతో ఏపి భవిషత్తు నాశనం అవుతందని అన్నారు. పెట్టుబడి దారులు, విశ్వాసం కోల్పోయే విధంగా జగన మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. వ్యాపారస్తులను బెదరగొడితే ఎవరైనా, పెట్టుబడులు ఎందుకు పెడతారు ? అమరావతిలో సింగపూర్ భారీ పెట్టుబడులు పెట్టింది. అయితే జగన ప్రభుత్వం, ఆ ఒప్పందాలను తిరగదోడుతుంది. ఇలా చేస్తే ఎవరైనా పెట్టుబడులు ఎందుకు పెడతారు అని ట్వీట్ చేసారు. ఇప్పటికే ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో, విద్యుత్ ట్రిబ్యునల్, కేంద్రం ప్రభుత్వం, హైకోర్ట్, ఫిచ్ రేటింగ్స్, వివిధ బిజినెస్ ఫోరమ్స్, జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయినా ప్రభుత్వం మాత్రం వినకుండా, పెట్టుబడిదారులని ఇబ్బంది పెడుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read