చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్ళు, మా జాతి మా జాతి అంటూ, చంద్రబాబు సానుకూలంగా ఉన్నా సరే, ఆయన్ను ఇబ్బంది పెడుతూ, కాపు రిజర్వేషన్ల అంశం పై, ముద్రగడ ఉద్యమాలు చేసేవారు. ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే, పెద్ద ఉద్యమం చేసి, రైలు కూడా తగలబెట్టి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసారు. చంద్రబాబు కాపులకు ప్రత్యెక కార్పొరేషన్ పెట్టారు, కాపుల్లో ఉన్న పేదలను ఆదుకున్నారు. తరువాత కాపు రిజర్వేషన్ పై, బిల్లు పెట్టి, కేంద్రానికి కూడా 2017లో పంపించారు. అయినా ముద్రగడ మాత్రం, చంద్రబాబు పై సణుగుతూనే ఉన్నారు. తరువాత కేంద్రం 10 శాతం అగ్రవర్ణాలకు రిజర్వేషన్ తీసుకు రావటంతో, జనాభా ప్రాతిపదికన, కాపులకు అందులో 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ, చంద్రబాబు జీఓ ఇచ్చారు.

mudragada 13082019 2

ఇలా చేస్తే, బీసిలకు కూడా ఇబ్బంది ఉండదు అని భావించారు. ఇంత చేసినా , ముద్రగడ మాత్రం, చంద్రబాబు పై విషం చిమ్ముతూనే వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే, చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కాపు రిజర్వేషన్ ఎత్తేసారు. అయితే ముద్రగడకు ఆ విషయం పై స్పందించటానికి, రెండు రోజులు పట్టింది. ఇది కూడా ఎదో ఒక లేఖ జగన్ కు రాసారు అంతే. ఇదే పని చంద్రబాబు చేసి ఉంటే, ముద్రగడ ఎలా చేసే వారో ఒకసారి ఊహించండి. అయితే, ఇప్పుడు జగన తో వర్క్ అవ్వదు అనుకున్నారో, లేక జగన్ ను కాకుండా, ప్రధాని మోడీనే ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నమో కాని, ఇప్పుడు ప్రధాని మోడీకి లేఖ రాసారు. ఈ లేఖలో మాత్రం, చంద్రబాబు చేసిందే మాకు ముద్దు అంటూ, చంద్రబాబు మాకు ఎంతో చేసారు అనే విధంగా ఉత్తరం రాసారు.

mudragada 13082019 3

02.12.2017న అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన 33/2017 కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన తన లేఖ ద్వారా మోడీకి విజ్ఞప్తి చేశారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ లో ఉందని చెప్పారు. తక్షణమే చంద్రబాబు అప్పట్లో పంపించిన ఆ బిల్లును ఆమోదించాలని, కాపు రిజర్వేషన్లకు మోడీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. అంటే, ఇప్పుడు ముద్రగడకు చంద్రబాబు విలువ ఏంటో తెలిసి వచ్చిందా ? లేక ఇది కూడా రాజకీయమా ? లేకపోతె ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్ ని ఏ ఇబ్బంది పెట్టకుండా, కేంద్రం పైకి నెట్టేసి, మోడీని దోషిగా చూపించే కొత్త ఎత్తుగడా ? ఏది నిజం అనేది కాలమే సమాధానం చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read