కాపు జాతిని కాపాడే ఏకైక నేత‌ని తానేన‌ని ప్ర‌క‌టించుకునే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకి కుంభ‌క‌ర్ణుడు మాదిరిగానే శాపం ఉంది. ఇది చాలా విచిత్ర‌మైన శాపం. వైసీపీ అధికారంలో ఉంటే ముద్ర‌గ‌డ హాయిగా నిద్ర‌పోతాడు. టిడిపి అధికారంలో ఉంటే నిద్ర‌మానేసి కాపు రిజ‌ర్వేష‌న్లు పేరుతో పోరాడుతుంటాడు. మ‌ళ్లీ వైసీపీ అధికారంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉంటే నిద్ర‌మ‌త్తు వ‌దిలేసి మ‌రీ లేఖ‌ల‌తో విరుచుకుప‌డ‌తాడు ముద్ర‌గ‌డ‌. సంబంధంలేని అంశాల‌పైనా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయ‌డంతో వైసీపీ కోసం ప‌నిచేసే కుంభ‌క‌ర్ణుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అని తేలిపోయింది.
ఈబీసీల‌కి ఇచ్చిన రిజ‌ర్వేష‌న్లు దెబ్బ తిన‌కుండా, బీసీల రిజ‌ర్వేష‌న్ల‌కి ప్రమాదం వాటిల్ల‌కుండా టిడిపి పాల‌న‌లో సీఎం చంద్ర‌బాబు కాపుల‌కి 5 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చారు. అయినా శాంతించ‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీ కోసం రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించారు. టిడిపి ఐదేళ్ల పాల‌న‌లో కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి వేల‌కోట్లు నిధులిచ్చినా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మం ఆప‌లేదు. ఐదేళ్లు (2014-19) టిడిపి పాల‌న మొత్తం ముద్ర‌గ‌డ ఉద్య‌మం కొన‌సాగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. కుంభ‌క‌ర్ణుడు మాదిరిగానే మ‌ళ్లీ నిద్ర‌లోకి జారుకున్నారు ముద్ర‌గ‌డ‌. కాపులకి చంద్ర‌బాబు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ జ‌గ‌న్ రెడ్డి ఎత్తేస్తే నోరు మెద‌ప‌లేదు. కాపు కార్పొరేష‌న్‌కి రూపాయి కూడా వైసీపీ స‌ర్కారు కేటాయించ‌క‌పోతే ఒక్క లేఖ కూడా రాయ‌లేదు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తే కుంభ‌క‌ర్ణుడి నిద్ర‌వీడి వ‌చ్చి మ‌రో లేఖ రాశారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read