ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అని రోజూ విష ప్ర‌చారం చేసే వైసీపీ కోసం పనిచేసే అస‌లు సిస‌లు ప్యాకేజీ స్టార్ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అని సాక్ష్యాధారాల‌తో వెల్ల‌డైంది. కాపు ఉద్య‌మం మాటున్న ఇన్నాళ్లూ వైసీపీ కోసం ప‌నిచేసిన ముద్ర‌గ‌డ ఒక లెట‌ర్‌తో ముసుగు తీసేసి తాను వైసీపీ ప్యాకేజీ స్టార్‌ని అని ప్ర‌క‌టించుకున్నారు. వారాహి యాత్ర‌లో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అవినీతి-దాష్టీకాల‌పై ధ్వ‌జ‌మెత్తారు. దీనిపై కౌంట‌ర్ ద్వారంపూడి ఇచ్చారు. వైసీపీ నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నీ తిట్టారు, వార్నింగులు ఇచ్చారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. వైసీపీ నేత ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శిస్తే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకి ఏంటో నొప్పి అంటున్నారు జ‌న‌సైనికులు. కాపుల కోస‌మే త‌న జీవితం అంకితం అని, కాపుల కోసం ప్రాణం ఇస్తాన‌నే ముద్ర‌గ‌డ‌...రెడ్ల కోసం ఊడిగం చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోప‌ణ‌ల‌పై వైసీపీ నేత‌లు స్పందించ‌డంలో అర్థం ఉంద‌ని, కాపు ఉద్య‌మ‌నేత‌న‌నే చెప్పుకునే ముద్ర‌గ‌డ వైసీపీ కోసం ఎందుకు స్పందిస్తున్నార‌ని జ‌న‌సైనికులు ప్ర‌శ్నిస్తున్నారు. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కాపు కాదు, రెడ్డి. ఆయ‌న కోసం ముద్ర‌గ‌డ గుడ్డ‌లు చించుకుని దీర్ఘాల‌తో ఉత్త‌రాలు రాయ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం లెట‌ర్ హెడ్ పోయింద‌ని, అది తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఉంద‌ని..దానిపై త‌మ‌కు నోటికొచ్చింది వారు రాసుకుంటున్నా ఏమీ అన‌లేని నిస్స‌హాయ‌స్థితిలో వైసీపీ ప్యాకేజీ స్టార్ ప‌ద్మ‌నాభం ఉన్నార‌ని జ‌న‌సేన ఆరోపిస్తోంది. రేష‌న్ మాఫియా డాన్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిది గౌరవప్రదమైన కుటుంబం అంటోన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం...కాపులు ఎంత‌గానో ప్రేమిస్తూ, ప్ర‌జాసేవ కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తోన్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ది గౌర‌వ‌నీయ‌మైన కుటుంబం కాదా అని జ‌న‌సైనికులు ముద్ర‌గ‌డ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లేఖ‌ని వైసీపీ సోష‌ల్ మీడియా ఇన్చార్జిలు విడుద‌ల చేయ‌డం, వైసీపీ సోష‌ల్ మీడియా గ్రూపుల‌న్నీ ముద్ర‌గ‌డ లెట‌ర్‌ని ప్ర‌ముఖంగా పోస్ట్ చేయ‌డం చూస్తుంటే...వైసీపీ కోసం ప‌నిచేసే అస‌లు సిస‌లు లెట‌ర్ ప్యాకేజీ స్టార్ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌మేన‌ని తేలుతోంద‌ని జ‌న‌సేన అంటోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read