ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మాస్కులు లేవు అంటే సస్పెండ్ అయిపోతున్నారు. నిన్నటికి నిన్న నర్సీపట్నం డాక్టర్, తమకు మాస్కులు లేవు, తమ ప్రాణాలతో ఆడుకుంటారా అని ఒక డాక్టర్ అడగటం, ఆయన వీడియో బయటకు రావటంతో, ఆ డాక్టర్ ను సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై, అందరూ ఆశ్చర్య పోయారు. ఈ సమయంలో డాక్టర్లకు అండగా ఉంటూ, వారికి సహాయం చెయ్యాల్సిన ప్రభుత్వం, వారి ఇబ్బందులు తీర్చకుండా, మాకు ఇబ్బంది ఉంది అంటే, సస్పెండ్ చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే మరొకటి జరిగింది. నిన్న తమ ఇబ్బందులు వివరిస్తూ, నగరి మున్సిపల్ కనిషనర్, ఒక సేల్ఫీ వీడియో పోస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్‌ కమిషనర్‌ వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ, నగిరిలో నాలుగు కేసులు వచ్చాయని, అయినా ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు అంటూ, ఆవేదన వ్యక్తం చేసారు. తమ అకౌంట్లన్నీ ఫ్రీజ్‌ చేసేశారని, తమకు ఎంతో ఇబ్బందిగా ఉందని వాపోయారు.

అంతే కాదు, కనీసం మాస్కులు, పీపీఈ డ్రెస్సులు కూడా లేవని వాపోయారు. గ్లౌజులు లేవు, బూట్లూ లేవు, మాస్కులు లేవు, పీపీఈ డ్రెస్సులు లేవు, అయినా మేము ప్రాణాలకు తెగించి పని చేస్తున్నామని అన్నారు. ఒక్క ప్రజా ప్రతినిధి కూడా తమకు సహాయం చెయ్యటం లేదని, బయట మాత్రం, నాలుగు మాస్కులు పంచి షో చేస్తున్నారని అన్నారు. ఇక ఈ నాయకుల అండ చూసుకుని, కొంత మంది వ్యాపారస్తులు కూడా తమని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. నాలుగు కేసులు రావటంతో, చికెన్ మటన్ షాపులు తాము తెరవద్దు అని చెప్తే, ఆ వ్యాపారస్తులు రాజకీయ అండతో, మళ్ళీ షాపులు ఓపెన్ చేసారని, వీళ్ళకు ప్రజల ప్రాణాలకంటే, వ్యాపారాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. ఇలా అనేక విధాలుగా తాము పడుతున్న ఇబ్బంది చెప్పుకున్నారు.

అయితే సమస్య ఏమిటో చూసి, గుర్తించి, దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, మళ్ళీ ఈ అధికారిని కూడా సస్పెండ్ చేసి పడేసారు. నగరి మున్సిపల్ కనిషనర్‍పై సస్పెన్షన్ వేటు వేసారు. కరోనా విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఈ నిర్ణయం తెసుకుంది. మాస్కులకు కూడా నిధులు లేవని సెల్ఫీవీడియో ద్వారా వ్యాఖ్యలు చేసారని, నగరి కమిషనర్ కామెంట్లను సీరియస్‍గా తీసుకున్న ఏపీ సర్కార్, సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్దంగా కమిషనర్ వ్యవహరించారన్న ప్రభుత్వం, ఆయన్ను సస్పెండ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా నగరి దాటి వెళ్లొద్దని చెప్పింది. నగరి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‍గా సీహెచ్ వెంకటేశ్వరరావు నియామకం చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read