ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు నాందేడ్ ఎస్పీ లేఖ రాశారు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ లేఖతోపాటు ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ కాపీని జత చేయకపోవడాన్ని గమనించిన ఏపీ డీజీపీ కార్యాలయం తిరిగి లేఖ రాస్తూ, ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఏదని ప్రశ్నించింది. కోర్ట్ ఇచ్చిన కాపీ జత చెయ్యకుండా, కేవలం అరెస్ట్ వారెంట్ పంపించటం పై డీజీపీ కార్యాలయం అభ్యంతరం తెలిపింది.

notiece 19092018

మరో పక్క, ఈ విషయం పై నిన్న చంద్రబాబు, సీనియర్ నేతలతో, న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. ‘మనం ప్రజల కోసం పోరాడాం. అందులో తప్పేమీ లేదు. అరెస్టు వారెంటు జారీ అయితే వెళ్లి ధర్మాబాద్‌ కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడతాను. న్యాయ వ్యవస్థను గౌరవిద్దాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు మాత్రం స్వయంగా వెళ్లి హాజరు కావలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సీఎం స్వయంగా వెళ్లకుండా.. తన తరపున న్యాయవాదిని పంపి వారెంటు ఉప సంహరణకు పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని, దానికి న్యాయమూర్తి అంగీకరించకపోతే అప్పుడు వెళ్లే విషయం ఆలోచిస్తే బాగుంటుందని వారు చెప్పారు.

notiece 19092018

ఇవిగాకుండా ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే ఆలోచించాలనీ సూచించారు. చంద్రబాబు కోర్టుకు హాజరైతే ఉత్తర తెలంగాణ రైతులు సంఘీభావంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ టీడీపీ నేతలు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎనిమిదేళ్ల నాటి కేసులో చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఆరోపిస్తూ, అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల నాటి ఈ కేసులో ధర్మాబాద్ కోర్టు తాజాగా చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read