చంద్రబాబు సొంత గ్రామం, చిత్తూరు జిల్లాలో ఉన్న నారావారి పల్లెలోని పంచాయతీలో ఈ రోజు దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నం చేసి, అడ్డంగా దొరికిపోయారు దొంగ బ్యాచ్. తిరుపతి నుంచి సుమారుగా 20 కిమీ తరువాత ఉండే నారావారి పల్లె పంచాయతీలో, దొంగ ఓట్లు వేయటానికి తిరుపతి నుంచి కొంత మంది యువకులు రావటంతో, వారిన్ పట్టుకోవటం జరిగింది. ఆ గ్రామస్తులు, కొత్తగా వచ్చిన వీళ్ళు అనుమాస్పదంగా ఉండటంతో, పోలీసులకు చెప్పారు. అయితే గ్రమాస్తులు చెప్పేంత వరకు కూడా పోలీసులు వారిని గుర్తించలేక పోయారు. ఎందుకంటే, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం, ఆధార్ కార్డు కానీ, ఓటరు కార్డు కానీ, ఏదో ఒకటి చూపించి లోపలకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు చూపించనప్పుడు, ఆ గ్రామానికి సంబందించిన రుజువులు కూడా ఉండాలి. అవేమి లేకుండా, దొంగ ఓట్లు వేయటానికి స్వయంగా చంద్రబాబు లాంటి పెద్ద నేత అయిన సొంత గ్రామంలోనే, ఏకంగా దొంగ ఓట్లు వేయటానికి వచ్చారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా 20 మందిని పట్టుకుని, గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఇదంతా ప్లాన్ ప్రాకారం అధికార పార్టీ చేస్తున్న అరాచకం అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నారావారిపల్లెలో వారి ఆటలు సాగవు కాబట్టి, ఇలా చేస్తున్నారని వాపోయారు.

nara 21022021 2

గోడలు దూకి కూడా వచ్చి, దొంగ ఓట్లు వేసి వెళ్లిపోతున్నారని వాపోతున్నారు. ఆ వీడియోకు ఒక ఛానల్ లో రావటంతో, అసలు ఏ రకంగా నారావారిపల్లెను టార్గెట్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. దొంగ ఓట్లు యదేచ్చగా వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా, పోలీసులు, అధికారుల సహకారంతో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే బెదిరింపులతో ఏకాగ్రీవాలు చేసుకున్నారని, ఎలాగొలా పోటీ చేస్తే, ప్రచారం చేసుకోనివ్వలేదని, ఎక్కడ చూసినా అధికార పార్టీ వాళ్ళ వాల్ పోస్టర్ లు ఉండేలా చూసుకున్నారని, అక్రమాలకూ పాల్పడ్డారని, ఇప్పుడు దొంగ ఓట్లు ద్వారా లబ్ది చేకుర్చుకునే విధంగా, ప్రతి పోలింగ్ బూత్ లో ప్రయత్నాలు చేస్తున్నారని, వాపోతున్నారు. దీని కోసం వార్డు వాలంటీర్లను కూడా ఉపయోగించుకుని, ఎవరు ఊరిలో లేరో తెలుసుకుని మరీ, ఆ ఓట్లు వేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇది మొత్తం చాలా ప్లాన్ ప్రకారం చేసారని, అసలు వీళ్ళకు కుప్పం, నారా వారి పల్లెను ఎందుకు ఇలా టార్గెట్ చేసారో అర్ధం కావటం లేదని టిడిపి నేతలు వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read