నిన్నటి నుంచి హడావిడి చేసి, హంగామా చేసి, బులుగు మీడియాలో తప్పుడు కధనాలు అల్లి, నానా యాగీ చేసి, చివరకు సాధించింది సున్నా.. అందరి టిడిపి నేతల అరెస్ట్ లు లాగే, ఇది కూడా ఏమి లేకుండా పోయింది. నారయణ కేసు విషయంలో, పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అంటూ హడావిడి చేసి, చివరకు ఎటూ కాకుండా పోయింది ప్రభుత్వం. అయితే బులుగు మీడియాని అడ్డు పెట్టుకుని, ఆయన్ను అల్లరి చేయటానికి మాత్రం, ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది. బులుగు మీడియాలో లీకు వీరుడు అని, విదేశాలకు పారిపోయే ప్రయత్నం అని, ఇలా ఆయన వ్యక్తిత్వ హననం చేసారు. కానీ చివరకు ఏమి చేయలేక తోక ముడిచారు. నారాయణను నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, అర్ధరాత్రి చిత్తూరు తీసుకుని, జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. నారాయణ పై ఎలాంటి ఆధారాలు చూపించ లేక పోయారు. దీంతో నారాయణ తరుపు న్యాయవాది, 2014లోనే ఆయన నారాయాణ చైర్మెన్ పదవి నుంచి తప్పుకున్నారని, ఆధారాలు కోర్టు ముందు ఉంచారు. అటు ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు చూపించ లేక పోవటం, నారాయణ విద్యా సంస్థల డైలీ కార్యక్రమాలతో, నారాయణకు ఎలాంటి సంబంధం లేకపోవటంతో, కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి, నారాయణను ఒక్క రోజు అయినా, జిల్లో ఉంచుదాం అనే కల నెరవేర లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read